RBI's New Rule: బ్యాంక్ అకౌంట్‌ను మరో బ్యాంక్‌కు మార్చుకోవచ్చు
RBI's New Rule: బ్యాంకుల కస్టమర్లకు పెద్దగా సౌలభ్యం కలిగించే విధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బ్యాంకింగ్ సేవలను మరింత సులభతరం చేయడం కోసం తీసుకుంటున్న కొత్త చర్యలలో, ఒక బ్యాంక్ నుండి మరో బ్యాంక్‌కు అకౌంట్ మార్చుకునే వ్యవస్థను సులభతరం చేయడం ప్రధానంగా ఉంది. సాధారణంగా ఒక బ్యాంక్ అకౌంట్‌కు జీతం, ఈఎంఐ, బీమా చెల్లింపులు లింక్ చేసిన తర్వాత, ఆ అకౌంట్‌ను వేరే బ్యాంక్‌కు మార్చడం కష్టమవుతుంది. దీన్ని పునరుద్దరించడానికి ఆర్బీఐ పేమెంట్స్ స్విచింగ్ స్వీస్ అనే కొత్త సెంట్రలైజ్డ్ ఫ్లాట్‌ఫామ్‌ను ప్రారంభించింది.
ఈ ఫ్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు తమ చెల్లింపులను ఒకే చోట సులభంగా నిర్వహించుకోవచ్చు, అవసరమైతే బ్యాంకుల మధ్య సులువుగా మార్చుకోవచ్చు. దీనివల్ల కస్టమర్లకు అకౌంట్ మార్పులు, ఫండ్స్ ట్రాన్స్ఫర్స్, బీమా, జీత చెల్లింపులు అన్ని అంతరాయం లేకుండా సులభతరం అవుతాయి.
ఇది ఇలా అనుకోవచ్చు- మీరు మీ ఫోన్ నెంబర్‌ను ఒక నెట్‌వర్క్ నుంచి మరొక నెట్‌వర్క్‌కు పోర్ట్ చేసుకునే విధానంలో, మీ బ్యాంక్ అకౌంట్‌ను కూడా ఒక బ్యాంక్ నుంచి మరొక బ్యాంక్‌కు మార్చుకోవచ్చు. అకౌంట్ నెంబర్ అదే ఉంటుంది, మారేది కేవలం బ్యాంక్ మాత్రమే. ఈ విధానం వల్ల కస్టమర్లు తమ ఆర్థిక లావాదేవీలలో ఎలాంటి సమస్యలు లేకుండా సేవలను పొందవచ్చు.
అంతర్జాతీయ లావాదేవీలలో వేగాన్ని పెంచడంలో కూడా ఆర్బీఐ దృష్టి సారిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ “పేమెంట్స్ విజన్ 2028” అనే కొత్త రోడ్ మ్యాప్‌ను విడుదల చేసింది. దీని ద్వారా విదేశీ చెల్లింపులను మరింత సులభతరం చేయడం, నియంత్రణ సమస్యలను తొలగించడం, సాంకేతిక అడ్డంకులను నివారించడం ప్రధాన లక్ష్యంగా ఉంది. ఈ కొత్త విధానం ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా చెల్లింపు వ్యవస్థను తీర్చిదిద్దుతుంది.
వ్యాపారులు, చిన్న, పెద్ద కంపెనీలకు ఉపయోగపడే విధంగా, విదేశీ లావాదేవీలలో పారదర్శకతను పెంచడం, లావాదేవీలు వేగవంతం చేయడం, జాప్యాలను తగ్గించడం వంటివి కూడా ఈ విధానం ద్వారా సాధ్యమవుతాయి.
ALSO REAED: Bottle: ఫ్రిజ్‌లో పెట్టడానికి ప్లాస్టిక్ బాటిల్ బెటరా?.. స్టీల్ బాటిల్ బెటరా?.. గాజు బాటిల్ బెటరా?