Bottle: ఫ్రిజ్‌లో పెట్టడానికి ప్లాస్టిక్ బాటిల్ బెటరా?.. స్టీల్ బాటిల్ బెటరా?.. గాజు బాటిల్ బెటరా?
Bottle: ఎండాకాలంలో చల్లటి నీటిని ఫ్రిజ్‌లో నిల్వ చేసి తాగడం మనందరికీ అలవాటు. అయితే మనం ఆ నీటిని ఏ బాటిల్‌లో ఉంచుతున్నామనేది ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతుంది. చాలామంది చౌకగా, తేలికగా ఉన్న ప్లాస్టిక్ బాటిళ్లను వాడుతుంటారు. కానీ సాధారణ ప్లాస్టిక్ బాటిళ్లలో BPA అనే హార్మోన్లకు హానికరమైన రసాయనాలు ఉండవచ్చు. ఈ బాటిళ్లను ఎక్కువకాలం ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల ఆ రసాయనాలు నీటిలో కలిసిపోతాయి. దాంతో మన శరీరంలోని హార్మోన్ల సమతుల్యతకు నష్టం కలుగుతుంది. అందుకే ప్లాస్టిక్ బాటిళ్ల వాడకంలో జాగ్రత్త తప్పనిసరి. వీలైతే BPA Free అని లేబుల్ ఉన్న బాటిళ్లను మాత్రమే ఎంచుకోవడం మంచిది.
ఆరోగ్య పరంగా, రిఫ్రిజిరేటర్‌లో నీటిని నిల్వ చేయడానికి గాజు బాటిళ్లను నిపుణులు అత్యంత సురక్షితంగా సూచిస్తున్నారు. గాజు ఎటువంటి రసాయనాలను విడుదల చేయదు. కాబట్టి నీటి స్వచ్ఛత, రుచి, సువాసన ఏమీ మారదు. కానీ గాజు పగిలే ప్రమాదం ఉండటంతో, వాడేటప్పుడు జాగ్రత్త అవసరం. ఇంట్లో ఉండి ఆరోగ్యాన్ని ప్రాధాన్యత ఇచ్చేవారికి గాజు సీసాలు మొదటి ఎంపికగా నిలుస్తాయి. ఇవి నీటిని సహజ నాణ్యతతో నిల్వ చేస్తాయి.
మరోవైపు, మన్నిక మరియు భద్రతకు ప్రాధాన్యం ఇచ్చేవారికి స్టెయిన్‌లెస్ స్టీల్ బాటిళ్లు మంచి ప్రత్యామ్నాయం. ఇవి ప్లాస్టిక్ కంటే శరీరానికి సురక్షితమే కాక, నీటిని ఎక్కువ సేపు చల్లగా ఉంచగలవు. ప్రయాణాలు, ఆఫీస్ వంటి సందర్భాల్లో ఇవి అనుకూలంగా ఉంటాయి. ఆయుర్వేద కోణంలో చూస్తే, రాగి పాత్రల్లో నీరు తాగడం శరీరాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. కానీ ఆయుర్వేద నిపుణుల సూచన ప్రకారం, రాగి పాత్రలను ఫ్రిజ్‌లో ఉంచకమళ్లా, బయట ఉంచి వాడడం మంచిది.
ప్రస్తుతం మార్కెట్‌లో ఫ్రిజ్‌లో నిల్వ చేయడానికి మట్టి సీసాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి నీటిలోని మలినాలను గ్రహించి, ప్రకృతి సిద్ధమైన చల్లదనాన్ని అందిస్తాయి. మొత్తం విషయం ఇలా.. మీ జీవనశైలి, బడ్జెట్‌ను బట్టి మీరు బాటిల్ ఎంపిక చేసుకోవచ్చు. కానీ దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి, గాజు లేదా స్టీల్ బాటిళ్లను ప్రధానంగా వాడడం మంచిది. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. కాబట్టి సరైన బాటిల్‌ను ఎంచుకొని, సురక్షితంగా ఉండడం అత్యవసరం.
ALSO READ: Mulkanoor: ఏప్రిల్ 1న అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం