🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 30 March 2026, 10:38 pm Posted by : STAR TRINETHRAM

Mulkanoor: ఏప్రిల్ 1న అయ్యప్ప స్వామి ఆరట్టు మహోత్సవం

News Image
Mulkanoor: ధర్మశాస్త్ర స్వరూపుడైన శ్రీ అయ్యప్ప స్వామివారి కృపాకటాక్షంతో, శబరిమలలో 2026 ఏప్రిల్ 1న జరగబోయే స్వామివారి జన్మదిన వేడుకల సందర్భంగా, పంబలో జరుగనున్న పవిత్ర ఆరట్టు మహోత్సవం కోసం భక్తులలో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహం నెలకొంది.

ఈ పవిత్ర సందర్భాన్ని పురస్కరించుకుని భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లోని శ్రీ విశ్వేశ్వర సహిత అయ్యప్ప స్వామి ఆలయం నుండి ఉదయం 9:00 గంటలకు స్వామివారి ఉత్సవ విగ్రహం మరియు అభిషేక విగ్రహాలతో ఊరేగింపు ఘనంగా నిర్వహించబడుతుందని ఆలయ కమిటీ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అనంతరం కొత్తకొండలోని శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం పరిధిలోని కోనేరులో స్వామివారికి పంచామృతాలతో పవిత్ర జలాభిషేకం (ఆరట్టు లేదా చక్రస్నానం) మహోత్సవం వైభవంగా జరుగుతుందని, స్వామివారి దివ్య స్నానం ద్వారా లోకక్షేమం, శాంతి, శుద్ధి కలుగుతుందని భక్తులు విశ్వసిస్తున్నారన్నారు. ఈ మహోత్సవాన్ని దర్శించడం ద్వారా భక్తులకు అపారమైన పుణ్యఫలం లభించనుందని ఆధ్యాత్మిక వేత్తలు పేర్కొన్నారు.

ఈ పుణ్యదినం మన హిందూ సంప్రదాయాల వైభవం, భక్తి శక్తి, ఐక్యతను ప్రతిబింబించే మహోత్సవం, కాబట్టి సమస్త భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ దివ్య కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు వినమ్రంగా కోరుతున్నారు. అలాగే మధ్యాహ్నం 12:30 గంటలకు భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేయబడినదని, ఈ పవిత్ర కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి కృపాకటాక్షాన్ని పొందాలని ముల్కనూర్ ఆలయ కమిటీ అందరినీ ఆహ్వానిస్తున్నారు.

ALSO READ: Actress Mamatha: ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక..
🏠 Home