Actress Mamatha: ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది.. చివరికి అంత్యక్రియలకు డబ్బుల్లేక..
Actress Mamatha: తెలుగు చిత్ర పరిశ్రమలో తన ప్రత్యేక హాస్య నటనతో ప్రేక్షకులను అలరించిన నటి మమత జీవితం మాత్రం చివరికి విషాదకరంగా మారింది. అసలు పేరు ఝాన్సీ రాణి అయిన ఆమె గుంటూరులో జన్మించి పెరిగారు. చిన్నప్పటి నుంచే నాటకాలు, నృత్యాలపై ఆసక్తి పెంచుకున్న ఆమెకు రంగస్థల నటుడైన తండ్రి వెంకటేశ్వరరావు ప్రోత్సాహం అందించారు. ఈ ప్రోత్సాహంతోనే నాటకాల్లో ప్రవేశించి తన ప్రతిభను చాటుకున్నారు. మద్రాసులో వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యం అభ్యసించడం ద్వారా కళారంగంలో మరింత పట్టు సాధించారు. అదే సమయంలో హేమమాలిని, రేఖ వంటి ప్రముఖులతో కలిసి శిక్షణ పొందడం ఆమె ప్రతిభకు నిదర్శనంగా నిలిచింది. మొదట రంగస్థల నాటకాలలో నటిస్తూ, చంద్రమోహన్ సరసన పలు ప్రదర్శనల్లో పాల్గొన్నారు.
సినీ రంగ ప్రవేశం 1972లో కృష్ణ నటించిన ఇన్స్పెక్టర్ భార్య చిత్రంతో ప్రారంభమైంది. ఆ తర్వాత చలం నిర్మించిన దేవతమ్మ చిత్రంలో రాజబాబు సరసన నటించడం ద్వారా ఆమెకు “మమత” అనే పేరు స్థిరపడింది. ఆ సినిమా తర్వాత హాస్యనటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. దేవుడు చేసిన మనుషులు, బంగారు కలలు వంటి చిత్రాల్లో తన హాస్య నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే కేవలం హాస్య పాత్రలకే పరిమితం కాకుండా హీరోయిన్‌గా నిలదొక్కుకోవాలనే ఆశతో 1975లో విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఆడదాని అదృష్టం చిత్రంలో కథానాయికగా నటించారు. ఆ తర్వాత మరికొన్ని చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించారు.
మలయాళ చిత్ర పరిశ్రమలో మాత్రం ఆమెకు హీరోయిన్‌గా అవకాశాలు లభించాయి. ఆనియన్, సత్రత్తిల్ ఒరు రాత్రి వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సత్రత్తిల్ ఒరు రాత్రి చిత్రంలో చేసిన ధైర్యవంతమైన పాత్ర ఆమెకు ప్రత్యేక గుర్తింపునిచ్చింది. అయితే అదే సమయంలో ఆ పాత్రలో ఆమె చేసిన సాహసోపేత సన్నివేశాలు వివాదాస్పదమై, ఆ సినిమా నిషేధానికి కూడా దారితీశాయి. ఈ కారణంగా ఆమెకు వచ్చిన శృంగార నటి అనే ముద్ర తెలుగులో హీరోయిన్ అవకాశాలను దూరం చేసింది. ఒకటి రెండు అవకాశాలు వచ్చినా చివరి క్షణంలో చేజారిపోవడంతో మమత మళ్లీ హాస్య పాత్రలకే పరిమితమయ్యారు.
డ్రైవర్ రాముడు, వేటగాడు వంటి చిత్రాలతో తిరిగి హాస్యనటిగా బిజీ అయిన మమత, తన కెరీర్‌లో 250కి పైగా చిత్రాల్లో నటించి మంచి సంపాదన కూడా చేశారు. అయినప్పటికీ ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం కష్టాలతో నిండిపోయింది. సినీ పరిశ్రమలో పోటీ పెరగడం, అలాగే పరిశ్రమ మద్రాసు నుంచి హైదరాబాద్‌కు మారిన సమయంలో ఆమె అక్కడే ఉండిపోవడం వల్ల అవకాశాలు తగ్గిపోయాయి. మంచి మనసున్న మమత తనకు తెలిసిన వారికి సహాయం చేస్తూ ఉండేవారు. అయితే ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఒక వ్యక్తిని నమ్మి మోసపోవడం వల్ల వివాహం కూడా జరగలేదు. ఆర్థిక సమస్యలు, అనారోగ్యం ఆమెను తీవ్రంగా ప్రభావితం చేశాయి.
చివరి దశలో ఆమె పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తినడానికి సరైన ఆహారం కూడా లేని స్థితికి చేరుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆమెకు రూ.50000 ఆర్థిక సహాయం అందించారు. కానీ ఆ సాయం కొంతకాలం మాత్రమే ఉపశమనం ఇచ్చింది. తన తమ్ముడు, అతని పిల్లల బాధ్యతలను భుజాన వేసుకున్నప్పటికీ, తనకోసం మాత్రం స్థిరమైన ఆశ్రయం కూడా ఏర్పరుచుకోలేకపోయారు. 2003 అక్టోబర్ 23న మమత కన్నుమూశారు. జీవితాంతం ప్రేక్షకులను నవ్వించిన ఈ హాస్యనటి చివరికి అంత్యక్రియలకే డబ్బులు వెతుక్కోవాల్సిన పరిస్థితి రావడం సినీ ప్రపంచంలో ఒక విషాద గాథగా మిగిలిపోయింది.
ALSO READ: Telangana Politics: గులాబీ పార్టీకి కవిత సవాల్?