🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 29 March 2026, 11:58 am Posted by : STAR TRINETHRAM

PAN Card Rules: మీకు పాన్‌ కార్డు ఉందా?.. అయితే అదిరిపోయే గుడ్‌న్యూస్‌

News Image
PAN Card Rules: ఆధార్ కార్డు మాదిరిగానే పాన్ కార్డు కూడా ఇప్పుడు ప్రతి ఆర్థిక వ్యవహారంలో కీలక పత్రంగా మారింది. బ్యాంకు డిపాజిట్లు, కేవైసీ ప్రక్రియలు, ఆదాయపు పన్ను దాఖలు వంటి అనేక అవసరాల్లో పాన్ తప్పనిసరి అవుతోంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి పాన్ కార్డుకు సంబంధించిన పలు కీలక మార్పులు అమలులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలు పాన్ పొందడం నుంచి బ్యాంకుల్లో నగదు జమ చేయడం వరకు అనేక అంశాలను ప్రభావితం చేయనున్నాయి. దీంతో సాధారణ ప్రజల నుంచి వ్యాపార వర్గాల వరకు ప్రతి ఒక్కరూ ఈ కొత్త నిబంధనలను తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

పాన్ కార్డు దరఖాస్తు ప్రక్రియలో ఇప్పటివరకు ఉన్న విధానంలో మార్పులు చేశారు. ఇకపై కేవలం ఆధార్ కార్డు ఆధారంగా మాత్రమే పాన్ మంజూరు చేసే విధానాన్ని రద్దు చేశారు. పాన్ కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తి తన ఆధార్ కార్డుతో పాటు మరో ఒరిజినల్ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. ఈ పత్రం జనన ధృవీకరణ పత్రం లేదా డ్రైవింగ్ లైసెన్స్ వంటి ఆధారంగా ఉండాలి. ముఖ్యంగా చిరునామా ధృవీకరణ కోసం అదనపు పత్రం అవసరం అవుతుంది. ఈ నిబంధన దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానుంది.

బ్యాంకింగ్ లావాదేవీల విషయంలో కూడా పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. గతంలో బ్యాంకులో రూ.50000 నగదు జమ చేయాలంటే పాన్ కార్డు చూపించాల్సి ఉండేది. ఈ నిబంధనను కొందరు దుర్వినియోగం చేస్తూ రూ.49000 లేదా రూ.48000 చొప్పున విడివిడిగా జమ చేస్తూ పాన్ చూపించకుండా తప్పించుకునే ప్రయత్నాలు చేసేవారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కొత్త విధానం తీసుకొచ్చారు. ఇకపై ఒక సంవత్సర కాలంలో బ్యాంక్ ఖాతాలో రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు జమ చేస్తే పాన్ చూపించడం తప్పనిసరి అవుతుంది. దీంతో లావాదేవీలలో పారదర్శకత పెరగనుందని అధికారులు భావిస్తున్నారు.

మోటారు వాహనాల కొనుగోలు విషయంలో కూడా పాన్ నిబంధనలను సవరించారు. గతంలో ప్రతి వాహనం కొనుగోలుకు పాన్ కార్డు తప్పనిసరి కాగా, ఇప్పుడు ఈ నిబంధనను సడలించారు. ఇకపై రూ.5 లక్షలు దాటిన విలువ గల వాహనాల కొనుగోలుకు మాత్రమే పాన్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ఇది ద్విచక్ర వాహనం అయినా, నాలుగు చక్రాల వాహనం అయినా ఒకే విధంగా వర్తిస్తుంది. రూ.5 లక్షల కంటే తక్కువ ధర ఉన్న వాహనాలకు పాన్ అవసరం ఉండదు. ఈ మార్పు కూడా ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.

ఆస్తుల కొనుగోలు, రిజిస్ట్రేషన్ విషయంలో కూడా కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటివరకు ఆస్తి విలువ లేదా సర్కిల్ రేటు రూ.10 లక్షలు దాటితే పాన్ కార్డు ఇవ్వడం తప్పనిసరి ఉండేది. కానీ ఇప్పుడు ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచారు. అంటే రూ.20 లక్షలు దాటిన ఆస్తి లావాదేవీలకు మాత్రమే పాన్ అవసరం ఉంటుంది. దీంతో మధ్య తరగతి ప్రజలకు కొంత ఉపశమనం లభించే అవకాశముంది.

హోటళ్లు, రెస్టారెంట్లలో నగదు చెల్లింపుల విషయంలో కూడా మార్పులు చేశారు. గతంలో రూ.50000 పైబడిన బిల్లులకు పాన్ అవసరమయ్యేది. ఇప్పుడు ఈ పరిమితిని రూ.100000కు పెంచారు. అలాగే బీమా ప్రీమియంల చెల్లింపుల విషయంలో కూడా ఇదే విధంగా పరిమితులను సవరించారు. దీంతో పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.

ఇతర లావాదేవీల విషయంలో కూడా ఒక ముఖ్యమైన నిబంధన అమలులో కొనసాగుతోంది. ఏ లావాదేవీకైనా ప్రత్యేకంగా పాన్ అవసరం లేకపోయినా, రూ.2 లక్షలు దాటిన నగదు లావాదేవీలకు పాన్ చూపించడం తప్పనిసరి అవుతుంది. ఈ నియమం ద్వారా పెద్ద మొత్తంలో జరిగే నగదు లావాదేవీలపై పర్యవేక్షణ మరింత బలపడనుంది. మొత్తం మీద ఈ మార్పులు ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత పెంచడమే కాకుండా, అక్రమ లావాదేవీలను నియంత్రించడంలో కీలక పాత్ర పోషించనున్నాయి.

ALSO READ: Chicken Price: భారీగా తగ్గిన చికెన్ ధరలు
🏠 Home