🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 27 March 2026, 12:30 pm Posted by : STAR TRINETHRAM

Dal Recipe: వేడి అన్నంతో ఈ పెసరపప్పు చారు తింటే ఆపడం కష్టం

News Image
Dal Recipe: ఇంటివంటల్లో ప్రత్యేక స్థానం దక్కించుకున్న పప్పు చారు చాలా మందికి ఎంతో ఇష్టమైన వంటకం. ముఖ్యంగా పల్లెటూర్లలో అయితే వారంలో కనీసం 3 సార్లు అయినా పప్పుతో చేసిన వంటలు భోజనంలో తప్పకుండా కనిపిస్తాయి. సాధారణంగా కందిపప్పుతో చేసే చారు అందరికీ తెలిసినదే అయినా, ఈసారి కొంచెం భిన్నంగా పెసరపప్పుతో చేసే చారు రుచి చూసేలా ప్రయత్నిస్తే ఇంట్లో వారంతా మళ్లీ మళ్లీ కోరే వంటగా మారుతుంది. ఒకసారి రుచి చూస్తే ఆ మృదువైన సువాసన, తేలికైన రుచి కారణంగా ఎవరైనా మళ్లీ తినకుండా ఉండలేరు.

ఈ వంటకం కోసం ఒక కప్పు పెసరపప్పు, కొద్దిగా చింతపండు, పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయ, 4 టమాటాలు, పోపు కోసం అవసరమైన దినుసులు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ మినపప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు, తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, అర టీ స్పూన్ పసుపు, కొత్తిమీర సిద్ధంగా ఉంచుకోవాలి. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి అందులో 2 గ్లాసుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. పప్పు బాగా మెత్తబడిన తర్వాత దాన్ని పక్కన పెట్టాలి.

తర్వాత ఉడికిన పప్పులో చింతపండు రసం, 4 పచ్చిమిర్చి, ముక్కలుగా కట్ చేసిన ఉల్లిపాయ, టమాటా ముక్కలు, అర టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, తగినంత ఉప్పు వేసి మళ్లీ బాగా మరిగించాలి. అన్ని పదార్థాలు కలిసిపోయే వరకు మంటపై ఉంచి ఉడికించాలి. ఆ తరువాత పప్పును మంటపై నుంచి దించి గుత్తితో మెత్తగా మెదిపి మరింత ముద్దగా తయారు చేయాలి.

ఇక మరో పాన్ తీసుకుని అందులో 2 టేబుల్ స్పూన్లు నూనె లేదా నెయ్యి వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించాలి. చివరగా కొద్దిగా ఇంగువ వేసి ఈ పోపును పప్పు చారులో కలపాలి. వడ్డించే ముందు కొత్తిమీరను సన్నగా కట్ చేసి చారులో చల్లి మంట ఆపేసి వేడి వేడిగా వడ్డించాలి. ఇలా తయారైన పెసరపప్పు చారు తేలికగా జీర్ణమవుతూ, రుచిలో ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది.

ALSO READ: APPSC Group 2: భారీగా ఏపీపీఎస్సీ గ్రూప్-2 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ ఎప్పుడో తెలుసా?
🏠 Home