🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 25 March 2026, 10:39 pm Posted by : STAR TRINETHRAM

Lavanya: రోడ్డుపై రాజ్‌తరుణ్ మాజీ ప్రియురాలు హల్‌చల్ (VIDEO)

News Image
Lavanya: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య మరోసారి వివాదంలో నిలిచింది. బుధవారం 25 తేదీన సంగారెడ్డి జిల్లా మల్లెపల్లి సమీపంలో ఆమె ప్రవర్తన స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుపై జరిగిన ఘటనలో పోలీసులు జోక్యం చేసుకోవాల్సి రావడంతో విషయం మరింత పెద్దదైంది. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

https://twitter.com/Telugufeedsite/status/2036818943839728052?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2036818943839728052%7Ctwgr%5E8ff963161124436e89d589957391d061524f23f1%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FTelugufeedsite%2Fstatus%2F2036818943839728052

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మల్కాపూర్ మండలం మల్లెపల్లి ప్రాంతంలో లావణ్య కారు అదుపుతప్పి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోవడానికి ఆమె ప్రయత్నించినట్లు సమాచారం. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కారును అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అక్కడికి చేరుకున్న ప్రజలు బాధితుడికి క్షమాపణ చెప్పాలని లావణ్యను కోరినా ఆమె తిరస్కరించడంతో వాగ్వాదం మరింత ముదిరింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ సమయంలో లావణ్య పోలీసులతో కూడా వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. అనంతరం పోలీసులు ఆమెకు బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడిపినట్లు తేలినట్లు సమాచారం. దీంతో ఆమెపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి చర్యలు ప్రారంభించారు. ఆమె వాహనాన్ని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఈ ఘటన సమయంలో లావణ్య కారులో మద్యం సీసాలు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియా లో వైరల్ కావడంతో మరోసారి ఆమె పేరు చర్చకు వచ్చింది. గతంలో కూడా వివాదాస్పద ఘటనలతో వార్తల్లో నిలిచిన లావణ్య ఈసారి చేసిన హడావిడి స్థానికంగా సంచలనం రేపింది.

ALSO READ: Andhra Pradesh: సీనియర్ సిటిజన్లకు ఉచిత కార్డులు
🏠 Home