Tribanadhari Barbaric: థియేటర్‌లో డిజాస్టర్.. ఓటీటీలో సూపర్ హిట్
Tribanadhari Barbaric: ప్రస్తుతం థియేటర్లలో కొత్త సినిమాల సందడి గట్టిగా కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన రెండు భారీ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకుపోతుండగా, పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మంచి స్పందనను సొంతం చేసుకుంటోంది. ఈ రెండు చిత్రాలు ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పిస్తుండగా, మరోవైపు ఓటీటీ వేదికలపై కూడా సినిమాలు సమానంగా ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా థియేటర్లలో పెద్దగా ఆదరణ పొందని కొన్ని సినిమాలు ఓటీటీలో మాత్రం ఆశ్చర్యకరంగా మంచి ఆదరణను సొంతం చేసుకుంటూ ట్రెండింగ్‌లో నిలుస్తున్నాయి.
ఇలాంటి పరిణామంలోనే ఒక థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో హాట్ టాపిక్‌గా మారింది. థియేటర్లలో విడుదలైనప్పుడు ఈ చిత్రాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. ప్రమోషన్స్ చేసినప్పటికీ సినిమా విడుదలైన వెంటనే నెగిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఆసక్తి చూపలేదు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయింది. అంతేకాదు, సినిమా ఫలితంపై నిరాశ చెందిన దర్శకుడు ఒక సందర్భంలో తనను తాను చెప్పుతో కొట్టుకున్న ఘటన కూడా అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పరిణామాల వల్ల ఈ సినిమా మరింత చర్చనీయాంశంగా మారింది.
ఆ చిత్రం మరేదో కాదు, తెలుగులో విడుదలైన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ ‘త్రిబాణధారి బార్బరిక్’. చాలా మందికి ఈ సినిమా విడుదలైందన్న విషయమే తెలియని పరిస్థితి నెలకొంది. ఈ చిత్రంలో సత్యరాజ్ ప్రధాన పాత్రలో నటించగా, సత్యం రాజేష్, ఉదయభాను కీలక పాత్రల్లో కనిపించారు. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా కథ, నేపథ్యం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. టైటిల్ కూడా ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదన్న అభిప్రాయాలు అప్పట్లో వినిపించాయి.
అయితే అదే సినిమా ఇప్పుడు ఓటీటీలో కొత్త జీవం పొందింది. థియేటర్లలో పట్టించుకోని ప్రేక్షకులు ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆసక్తిగా వీక్షిస్తున్నారు. ముఖ్యంగా థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విపరీతంగా ఆదరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతూ మంచి వ్యూస్ సొంతం చేసుకుంటోంది. కథలో ఉన్న ట్విస్టులు, మిస్టరీ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుండటంతో ఈ చిత్రం ఓటీటీలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. ఒకప్పుడు ఫ్లాప్‌గా మిగిలిపోయిన సినిమా, ఇప్పుడు ఓటీటీలో హిట్‌గా మారడం సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన పరిణామంగా చెప్పుకోవచ్చు.
ALSO READ: Andhra Pradesh: ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు గుడ్‌న్యూస్!