నిరుద్యోగులకు అలర్ట్.. కొత్త DSC 2026 నోటిఫికేషన్ విడుదల తేదీ ఇదే..
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ఏపీలో కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త అందించింది. మొత్తం 10,060 ఉద్యోగాలతో కూడిన విస్తృత జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేస్తూ నియామకాల ప్రక్రియకు స్పష్టమైన రోడ్‌మ్యాప్‌ను ప్రకటించింది. ఈ జాబ్ క్యాలెండర్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ విడుదల చేయడం విశేషం. ఇందులో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ తేదీలను ముందుగానే ప్రకటించడం ద్వారా అభ్యర్థులకు ముందస్తు అవగాహన కల్పించారు. మొత్తం 4 విడతల్లో 41 నోటిఫికేషన్లు జారీ చేసి అన్ని పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డీఎస్సీ, పోలీసు నియామకాలను మినహాయించి మిగతా అన్ని ఉద్యోగాలను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 1,500 అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మే 15న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ నియామకాలకు 2018 తరహాలోనే ఏపీపీఎస్సీ ఆధ్వర్యంలో స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించనున్నారు.
ఈ జాబ్ క్యాలెండర్లో అత్యధిక ప్రాధాన్యం పాఠశాల విద్య, హోంశాఖలకు ఇవ్వడం గమనార్హం. పాఠశాల విద్యలో మొత్తం 3,004 ఉద్యోగాలను భర్తీ చేయనుండగా, హోంశాఖలో 2,778 పోస్టులు ఉన్నాయి. ముఖ్యంగా ఉపాధ్యాయ నియామకాల కోసం అక్టోబర్ 15న 2,535 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయించారు. ఈ డీఎస్సీ ద్వారా ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు ప్రత్యేక డీఎస్సీ ఖాళీలు కూడా భర్తీ చేయనున్నారు. అదనంగా మ్యూజిక్, క్రాఫ్ట్, ఆర్ట్, డ్యాన్స్ టీచర్ పోస్టులను కూడా ఈ నియామకాలలో భాగంగా పూరించనున్నారు. అలాగే డైట్, ఎన్సీఈఆర్టీ లెక్చరర్ పోస్టులు 160, జూనియర్ లెక్చరర్ పోస్టులు 209, లైబ్రేరియన్ పోస్టులు 100 వరకు ఇదే నెలలో నోటిఫికేషన్లు విడుదల కానున్నాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేశ్ ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో, ఈ జాబ్ క్యాలెండర్ ఆ హామీకి కొనసాగింపుగా భావిస్తున్నారు. ఖాళీలు, పదవీవిరమణల ద్వారా వచ్చే పోస్టులను కలిపి 4 సంవత్సరాల కాలానికి విభజించి ఈ నియామక ప్రణాళికను రూపొందించారు.
ఇక రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో కీలక సూచనను కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఉద్యోగ నోటిఫికేషన్లు వచ్చేలోపు అభ్యర్థులు తప్పనిసరిగా నైపుణ్య పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని సూచించింది. ఈ పోర్టల్‌లో తమ విద్యార్హతలు, నైపుణ్యాల వివరాలు నమోదు చేస్తే, జాబ్ క్యాలెండర్లో ఉన్న ఉద్యోగాల సమాచారం మాత్రమే కాకుండా భవిష్యత్తులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు రంగంలో వచ్చే ఉద్యోగ అవకాశాల వివరాలు కూడా అందుబాటులోకి వస్తాయి. నమోదు ప్రక్రియలో ముందుగా ఆధార్ నంబరు నమోదు చేసి, సెల్‌ఫోన్‌కు వచ్చే ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి. ఆ తర్వాత వ్యక్తిగత వివరాలు, విద్యార్హతలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా సాంకేతిక వేదికల ద్వారా ఉద్యోగ సమాచారం అందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.
ALSO READ: ఒకే ఇంట్లో 5 మృతదేహాలు.. అసలేం జరిగింది?