Bhadrachalam: రాములోరి కళ్యాణానికి అంతా సిద్ధం!
Bhadrachalam: దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాద్రి క్షేత్రం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందడితో కళకళలాడుతోంది. అంకురార్పణతో ప్రారంభమైన వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక ఉత్సవాలు భక్తి వైభవాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఆలయం పరిసరాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతూ చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలతో అలంకరించారు. విద్యుద్దీపాలంకరణతో రామాలయం రాత్రివేళల్లో మరింత దివ్యంగా మెరిసిపోతోంది. మార్చి 27న సీతారాముల తిరు కల్యాణం, 28న శ్రీరామ పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టడం గమనార్హం.
మార్చి 19 నుంచి ఏప్రిల్ 2 వరకు కొనసాగనున్న ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేపపూత ప్రసాదం, పంచామృతాభిషేకం, పంచాంగ శ్రవణం వంటి కార్యక్రమాలతో ఉత్సవాలు ఘనంగా ఆరంభమయ్యాయి. అనంతరం మార్చి 23న మండల లేఖ, కుండ, కలశ యాగశాల కార్యక్రమాలు, 24న గరుడాధివాసం, 25న అగ్నిప్రతిష్ఠ, ధ్వజారోహణం, 26న ఎదుర్కోలు, 27న శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కల్యాణం నిర్వహించనున్నారు. 28న మహా పట్టాభిషేకం, 29న సదస్యం, 30న తెప్పోత్సవం, 31న ఊంజల్ సేవ, ఏప్రిల్ 1న వసంతోత్సవం, 2న పూర్ణాహుతి, ధ్వజావరోహణంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా గురువారం నుంచి ఏప్రిల్ 2 వరకు ఆలయంలో నిత్య కల్యాణాలు, ప్రభుత్వోత్సవాలు, పవళింపు సేవలను నిలిపివేస్తున్నారు.
భక్తుల సౌకర్యార్థం మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపాన్ని 24 విభాగాలుగా విభజించి, అందులో 31వేల మంది ప్రత్యక్షంగా కల్యాణాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. ఈసారి ఎండలు అధికంగా ఉండటంతో జిల్లా కలెక్టర్ అంకిత్ ప్రత్యేక చొరవతో అన్ని విభాగాల్లో పొగమంచు సౌకర్యం కల్పిస్తున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేందుకు 50 టన్నుల శీతలీకరణ యంత్రాలు, 100 కూలర్లు, 250 ఫ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు. భద్రాచలం, పర్ణశాల ప్రాంతాల్లో కలిపి 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేసి భక్తులకు సౌకర్యం కల్పిస్తున్నారు. అదేవిధంగా మజ్జిగ, తాగునీరు నేరుగా అందించే ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. వైద్యశాఖ సహకారంతో ఆరోగ్య సేవలను కూడా సిద్ధం చేశారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని 25 ప్రసాదాల కౌంటర్లు, 70 తలంబ్రాల పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. నవమి అనంతరం తలంబ్రాలను కార్గో, పోస్టల్, ఆన్‌లైన్, ప్రచార విభాగాల ద్వారా భక్తులకు పంపేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈసారి 300 క్వింటాళ్ల ముత్యాల తలంబ్రాలను సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా 2 లక్షల లడ్డూల తయారీకి 30 మంది సిబ్బంది కృషి చేస్తున్నారు. శ్రీరామనవమి రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించనుండగా, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో భద్రాద్రి మొత్తం ఆధ్యాత్మిక ఉత్సాహంతో నిండిపోయింది.
ALSO READ: CP Sajjanar: ఆడపిల్లల పాలిట శాపంగా మారుతున్న స్మార్ట్‌ఫోన్