Rebel Star: ప్రభాస్‌కు తల్లిగా, భార్యగా, మరదలిగా, ప్రియురాలిగా నటించిన ఏకైక హీరోయిన్ ఎవరో తెలుసా?
Rebel Star: పాన్ ఇండియా స్థాయిలో అపారమైన క్రేజ్ సంపాదించుకున్న హీరోగా ప్రభాస్ ప్రత్యేక గుర్తింపు పొందారు. టాలీవుడ్లోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆయన స్టార్డమ్, బాహుబలి సినిమా తర్వాత మరింత పెరిగింది. ఆ చిత్రంతో ఆయన కెరీర్ కొత్త దశలోకి అడుగుపెట్టగా, వరుసగా భారీ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ ప్రస్తుతం అత్యంత బిజీ హీరోగా కొనసాగుతున్నారు. చేతినిండా ప్రాజెక్టులతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్న ప్రభాస్ సినిమాల కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల రాజా సాబ్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, ప్రస్తుతం స్పిరిట్, ఫౌజీ వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
ఇదిలా ఉండగా ప్రభాస్ కెరీర్లో ఎందరో హీరోయిన్లతో నటించినప్పటికీ, ఒక హీరోయిన్ మాత్రం అతని సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపించి ప్రత్యేక గుర్తింపు పొందింది. అదే అనుష్క శెట్టి. టాలీవుడ్లో లేడీ సూపర్ స్టార్‌గా పేరు పొందిన ఆమె.. ప్రభాస్‌కు మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా కూడా తెరపై కనిపించడం విశేషం. ఒకే హీరోతో ఇంత విభిన్న పాత్రల్లో కనిపించడం అరుదైన విషయం కావడంతో ఈ జోడీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది.
సాధారణ యోగా టీచర్‌గా జీవితం ప్రారంభించిన అనుష్క శెట్టి, ఆ తర్వాత అనుకోకుండా సినీ రంగంలోకి అడుగుపెట్టి అగ్ర కథానాయికగా ఎదిగింది. సూపర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఆమె, అరుంధతి చిత్రంతో భారీ విజయాన్ని అందుకొని తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ తర్వాత గ్లామర్ పాత్రలతో పాటు కథా ప్రాధాన్యత ఉన్న చిత్రాల్లోనూ నటించి నటిగా మంచి పేరు సంపాదించింది.
ప్రభాస్, అనుష్క శెట్టి కలిసి నటించిన సినిమాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. బిల్లా, మిర్చి, బాహుబలి 1, బాహుబలి 2 వంటి చిత్రాల్లో వీరిద్దరి జంటకు మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా వీరిద్దరి కెమిస్ట్రీకి అభిమానుల్లో ప్రత్యేక స్థానం ఏర్పడింది. ఈ చిత్రాల తర్వాత అనుష్క సినిమాల సంఖ్య తగ్గించినప్పటికీ, ఎప్పుడో ఒకసారి మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తూ తన ప్రత్యేకతను కొనసాగిస్తోంది.
ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే.. నాలుగు పదుల వయస్సు దాటినా అనుష్క శెట్టి ఇంకా వివాహం చేసుకోకుండా ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. గత కొన్ని రోజులుగా ఆమె పెళ్లి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగినప్పటికీ, ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆమె టీమ్ స్పష్టంచేసింది. దీంతో ఆ ప్రచారాలకు తెరపడినట్లైంది.
ALSO READ: Budget 2026-27: రూ.3.24 లక్షల కోట్లతో తెలంగాణ బడ్జెట్