Vastu Tips: ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఈ దిశలో పెడితే డబ్బుల వర్షం
Vastu Tips: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య యుద్ధ ప్రభావం పరోక్షంగా అనేక రంగాలపై పడుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల సరఫరాలో అంతరాయాలు ఏర్పడి, సామాన్య ప్రజల నుంచి వ్యాపార వర్గాల వరకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కొన్నిచోట్ల సిలిండర్లు అందుబాటులో లేకపోవడం మాత్రమే కాకుండా, ధరలు కూడా పెరగడం వల్ల కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. ఈ పరిస్థితుల్లో సిలిండర్ వినియోగంపై మాత్రమే కాకుండా, దాన్ని ఇంట్లో ఎక్కడ ఉంచుతున్నామన్న అంశం కూడా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే ప్రతి వస్తువుకూ ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న చిన్న వస్తువుల ఏర్పాటు కూడా మన జీవితంపై ప్రభావం చూపుతుందని వారు చెబుతున్నారు. ముఖ్యంగా వంటగదిలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్, స్టవ్ వంటి వస్తువులను సరైన దిశలో ఉంచడం ద్వారా ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుందని విశ్వసిస్తున్నారు. వాస్తు నిపుణుల సూచనల ప్రకారం గ్యాస్ సిలిండర్, స్టవ్‌ను ఆగ్నేయ దిశలో ఉంచడం అత్యంత శ్రేయస్కరంగా భావిస్తున్నారు. ఈ దిశ అగ్ని తత్వానికి చెందినదిగా ఉండటంతో, వంటకు సంబంధించిన వస్తువులను ఇక్కడ ఉంచడం వల్ల ప్రతికూల శక్తులు తొలగి, ఇంట్లో శుభప్రభావాలు పెరుగుతాయని చెబుతున్నారు. అదేవిధంగా ఈ విధంగా ఏర్పాటు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి ఆర్థికంగా పురోగతి సాధించే అవకాశాలు ఉంటాయని నమ్మకం వ్యక్తమవుతోంది.
ఇంటి నిర్మాణం లేదా స్థలం కారణంగా ఆగ్నేయ దిశలో సిలిండర్ ఉంచడం సాధ్యంకాకపోతే, నైరుతి లేదా తూర్పు దిశల్లో ఉంచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేసినా ఇంట్లో ప్రతికూలతలు తగ్గి ప్రశాంతత పెరుగుతుందని చెబుతున్నారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఈశాన్య దిశలో గ్యాస్ సిలిండర్‌ను ఉంచకూడదని స్పష్టం చేస్తున్నారు. ఈశాన్య దిశలో అగ్ని సంబంధిత వస్తువులు ఉంచడం వలన పనులు అడ్డంకులు ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
Note: పై వార్తలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. స్టార్ త్రినేత్రం దీనిని అధికారికంగా ధృవీకరించలేదు.
ALSO READ: Mosquito Control: 2 స్పూన్ల కొబ్బరి నూనెతో ఇంట్లో దోమలు మాయం