Bihar News: మైనర్ బాలుడితో ప్రేమలో పడ్డ బాలిక.. ఇంట్లో తెలిశాక ఏమైందంటే?
Bihar News: బీహార్ రాష్ట్రంలో ఒక ఆశ్చర్యకర ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమ విషయంలో తన కుటుంబం అంగీకరించకపోవడంతో ఒక మైనర్ బాలిక తీసుకున్న చర్య స్థానికంగా కలకలం రేపింది. తన ప్రియుడితోనే పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ ఆ బాలిక ఏకంగా హైటెన్షన్ విద్యుత్ స్తంభాన్ని ఎక్కి నిరసన వ్యక్తం చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ సంఘటన బీహార్‌లోని మోతిహారి ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన 33KV హైటెన్షన్ విద్యుత్ లైన్ స్తంభంపైకి ఆమె ఎక్కి కూర్చోవడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతూ చర్చకు దారి తీస్తోంది.
ఆ బాలిక తన ప్రియుడితోనే వివాహం జరగాలని కుటుంబ సభ్యులపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సుమారు 4 గంటల పాటు ఆమె విద్యుత్ స్తంభం మీదే కూర్చుని దిగేందుకు నిరాకరించింది. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. విద్యుత్ స్తంభం ఎత్తులో ఉండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరగొచ్చనే భయంతో ప్రజలు ఆందోళన చెందారు. వెంటనే స్థానిక అధికారులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని బాలికను ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాత్రం తన ప్రియుడితోనే పెళ్లి జరగాలని పట్టుబట్టినట్లు సమాచారం.
ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు కూడా బయటకు వచ్చాయి. 2 రోజుల క్రితం ఆ బాలిక ప్రేమ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిసినట్లు సమాచారం. ఆమె ప్రియుడు కూడా మైనర్ వయసులోనే ఉన్నాడని తెలుస్తోంది. ఈ విషయం తెలిసిన వెంటనే బాలిక కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. బాలికతో సంబంధం పెట్టుకున్నందుకు ఆమె ప్రియుడిని కొట్టినట్లు కూడా సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ పరిణామాల తర్వాత బాలిక తీవ్ర మనస్థాపానికి గురై ఈ విధంగా విద్యుత్ స్తంభాన్ని ఎక్కి నిరసన తెలిపినట్లు తెలుస్తోంది.
బాలిక స్తంభంపై ఉండటంతో స్థానికంగా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కొందరు ఆమెను కిందకు దిగమని వేడుకోగా, మరికొందరు పరిస్థితిని వీడియో తీసి సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ ఘటన గంటల తరబడి ఉద్రిక్తతను సృష్టించింది. చివరికి స్థానిక పెద్దలు, అధికారులు కలిసి ఆమెను చాలా సమయం పాటు ఒప్పించి కిందకు దింపినట్లు సమాచారం. అనంతరం బాలికను సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు.
ALSO READ: 10/G Railway Quarters: ఏం ట్విస్‌లు రా బాబు.. ప్రియురాలి కోసం భార్యకి స్కెచ్!