Viral Relationship: భర్తను ప్రియురాలికి లీజుకు ఇస్తానన్న భార్య.. ట్విస్ట్ అదుర్స్
Viral Relationship: ప్రపంచంలో వివాహ బంధం అనేది విశ్వాసం, పరస్పర గౌరవం మీద నిలబడే బలమైన సంబంధంగా భావిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య నమ్మకం ఎంతో కీలకం. సాధారణంగా మహిళలు జీవితంలో చాలా విషయాలు పంచుకోవచ్చు కానీ తమ భర్తను మరో మహిళతో పంచుకోవాలని మాత్రం ఎప్పుడూ కోరుకోరు. ఒకసారి భర్త మరో మహిళతో దగ్గరగా ఉంటున్నాడని తెలిసినా చాలా కుటుంబాల్లో పెద్ద వివాదాలు చెలరేగిన సందర్భాలు ఉన్నాయి. అయితే విదేశాల్లో చోటుచేసుకున్న ఒక విచిత్ర ఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. భర్తకు మరో మహిళతో సంబంధం ఉందని తెలిసిన ఒక భార్య ఆశ్చర్యకరమైన నిర్ణయం తీసుకుని అందరినీ విస్మయానికి గురి చేసింది. నెలకు సుమారు రూ.85,000 చెల్లిస్తే తన భర్తను తీసుకెళ్లి ఉంచుకోవచ్చని భర్త ప్రియురాలికి ఆఫర్ ఇచ్చిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారి తీస్తోంది.
ఈ ఘటన దక్షిణాసియా ప్రాంతంలోని థాయిలాండ్ దేశంలో జరిగినట్టు సమాచారం. అక్కడ నిర్వహించే థాయ్ టాక్ షో హోన్ క్రాసెయిలో ఖున్ క్వాంగ్ అనే మహిళ తన జీవితంలో జరిగిన సంఘటనను వివరించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. తాను 21 సంవత్సరాల వయసులో ఒక పోలీసు అధికారిని వివాహం చేసుకున్నట్లు తెలిపింది. వివాహం తర్వాత వారి జీవితం చాలా సంవత్సరాల పాటు సుఖసంతోషాలతో సాగిందని ఆమె వివరించింది. దాదాపు 10 సంవత్సరాల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా జీవనం కొనసాగిందని తెలిపింది. వారి దాంపత్య జీవితానికి గుర్తుగా ఒక కుమారుడు కూడా జన్మించాడు. ప్రస్తుతం ఆ బాలుడి వయసు 8 సంవత్సరాలు అని ఆమె చెప్పింది.
అయితే 2025 సంవత్సరంలో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయని ఆమె వెల్లడించింది. ఒక రోజు తన భర్త సోషల్‌మీడియాలో ఒక అపరిచిత మహిళను ఫాలో అవ్వడం గమనించిందని చెప్పింది. ఆ విషయం చూసినప్పటికీ తొలుత అతనిని ఏమీ ప్రశ్నించలేదని తెలిపింది. కానీ కొద్ది రోజుల్లోనే అతని ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపించిందని ఆమె గుర్తుచేసుకుంది. ఇంటికి ఆలస్యంగా రావడం ప్రారంభించాడని, కొన్ని రోజుల్లో అయితే అర్ధరాత్రి తర్వాత మాత్రమే ఇంటికి చేరుకునేవాడని చెప్పింది. దీనిపై ప్రశ్నించగా తాను ఈ కుటుంబ జీవితాన్ని వదిలేసి వెళ్లిపోవాలని అనిపిస్తోందని, ఇల్లు కారు వంటి ఆస్తులు అన్నీ వదిలి ఖాళీ చేతులతో వెళ్లిపోతానని తన భర్త చెప్పాడని ఆమె వెల్లడించింది. అతని మాటలు విన్న తర్వాత తన అనుమానం మరింత పెరిగిందని ఆమె తెలిపింది.
ఈ పరిస్థితుల్లో అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకున్న ఖున్ క్వాంగ్ ప్రైవేటు డిటెక్టివ్‌ను నియమించి తన భర్తపై ఎంక్వైరీ పెట్టించింది. కొద్ది రోజుల పరిశీలన తర్వాత అతనికి నిజంగానే మరో మహిళతో సన్నిహిత సంబంధం ఉన్నట్టు బయటపడింది. ఈ విషయం తెలిసిన తర్వాత ఖున్ క్వాంగ్ తన భర్తను తిరిగి ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించింది. అతడిని ఒప్పించి మళ్లీ ఇంటికి రావాలని చెప్పింది. కానీ అతని మనసులో మాత్రం ఆ మహిళపై ఉన్న అనురాగం తగ్గలేదని ఆమె తెలిపింది. ఒక రోజు రాత్రి లేచి తన ప్రియురాలిని మరిచిపోలేకపోతున్నానని తన బాధను ఆమె ముందు వెల్లడించాడని ఆమె వివరించింది.
ఆ సమయంలో ఖున్ క్వాంగ్ ఒక అసాధారణమైన నిర్ణయం తీసుకుందని చెప్పింది. తన భర్త ప్రియురాలిని నేరుగా కలుసుకుని ఒక ఆశ్చర్యకరమైన ప్రతిపాదన చేసింది. తన భర్తను తీసుకెళ్లి ఉండాలనుకుంటే నెలకు 30 వేల బాట్ (భారత కరెన్సీలో సుమారు రూ.85 వేలు) అనే మొత్తాన్ని ఇవ్వాలని షరతు పెట్టింది. ఈ ప్రతిపాదన విన్న భర్త మొదట నిరాకరించినప్పటికీ అతని ప్రియురాలు మాత్రం ఆ ఒప్పందానికి అంగీకరించిందని ఆమె తెలిపింది. దీంతో ఈ విచిత్రమైన ఒప్పందంపై అక్కడ పెద్ద చర్చ మొదలైంది.
ఈ ఘటన బయటకు రావడంతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. కొందరు దీనిని విచిత్ర నిర్ణయంగా అభివర్ణిస్తుండగా మరికొందరు ఇది కుటుంబ వ్యవస్థకు విరుద్ధమని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ నిపుణులు కూడా ఇలాంటి ఒప్పందాలకు చట్టపరమైన గుర్తింపు ఉండదని స్పష్టం చేస్తున్నారు. సమాజంలో ఉన్న నైతిక విలువలకు కూడా ఇది విరుద్ధమని వారు అంటున్నారు. అయినప్పటికీ ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు దారి తీసింది. భార్య తీసుకున్న ఆ విచిత్ర నిర్ణయం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అనేక మందిని ఆశ్చర్యపరుస్తోంది.
ALSO READ: Manisha Kalyan: ఫుట్‌బాల్ మ్యాచ్‌లో 30 గజాల దూరం నుంచి అద్భుత గోల్