🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 15 March 2026, 12:01 pm Posted by : STAR TRINETHRAM

Ramadan 2026: భారత్‌లో రంజాన్ పండుగ మార్చి 20 హా.. లేదా 21 హా?

News Image
Ramadan 2026: పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. రంజాన్ నెల చివరి వారంలోకి ప్రవేశిస్తున్న ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఈద్ పండుగకు సన్నాహాలు ప్రారంభించారు. ముస్లింలకు అత్యంత పవిత్రమైన పండుగలలో ఈద్ ఉల్-ఫితర్ (రమదాన్) ఒకటి. ఇస్లామిక్ చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం షవ్వాల్ నెల మొదటి రోజున ఈ పండుగను నిర్వహిస్తారు. ఒక నెల పాటు ఉపవాసం పాటించిన తర్వాత సంతోషంగా జరుపుకునే ఈ పండుగలో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కలిసి ఆనందంగా గడుపుతారు. పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం, పేదలకు దానం చేయడం వంటి సంప్రదాయాలు కూడా ఈ పండుగలో ముఖ్య భాగంగా ఉంటాయి. ఇస్లాం మతంలో ఉన్న ఐదు ప్రధాన సూత్రాలలో ఉపవాసం ఒకటిగా భావిస్తారు.

https://twitter.com/AstronomyCenter/status/2030911980048138305?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2030911980048138305%7Ctwgr%5Edba0d36d8d31ef9d215772812f519e7c2fc60936%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FAstronomyCenter%2Fstatus%2F2030911980048138305

చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం అమావాస్య తర్వాత నెలవంక దర్శనం ఆ నెల ప్రారంభాన్ని నిర్ణయిస్తుంది. ఒక చాంద్రమాన నెల సాధారణంగా 29 లేదా 30 రోజులు ఉంటుంది. అందువల్ల ఈద్ పండుగ ఖచ్చితమైన తేదీని ముందుగానే నిర్ణయించడం కష్టం అవుతుంది. నెలవంక కనిపించిన రోజు ఆధారంగా రంజాన్ ముగిసి ఈద్ పండుగను జరుపుకుంటారు. అందుకే ప్రతి సంవత్సరం ఈద్ తేదీ కొంత మారుతూ ఉంటుంది.

ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈద్ ఒకే రోజున జరగదు. దీనికి ప్రధాన కారణం సమయ మండలాల మధ్య తేడాలు. భూమి తన అక్షంపై తిరుగుతూ ఉండటం వల్ల ప్రతి ప్రాంతంలో సూర్యోదయం, సూర్యాస్తమయం సమయాలు భిన్నంగా ఉంటాయి. అదే కారణంగా నెలవంక కూడా ప్రతి ప్రాంతంలో ఒకే సమయంలో కనిపించదు. ఉదాహరణకు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి గల్ఫ్ దేశాల్లో సాధారణంగా భారతదేశం, పాకిస్తాన్ వంటి దేశాల కంటే ఒక రోజు ముందుగా ఈద్ జరుపుకుంటారు.

అంతర్జాతీయ ఖగోళ పరిశీలన కేంద్రాల అంచనాల ప్రకారం సౌదీ అరేబియాలో అమావాస్య అనంతరం మార్చి 18న నెలవంక కనిపించే అవకాశం ఉంటే, అక్కడ మార్చి 19న ఈద్ జరుపుకునే అవకాశం ఉంది. అయితే ఆ రోజున నెలవంక కనిపించకపోతే రంజాన్ మాసం 30 రోజులు పూర్తయ్యాక మార్చి 20న ఈద్ జరుపుకునే అవకాశం ఉంటుంది. ఖగోళ నిపుణుల ప్రకారం కొన్ని ప్రాంతాల్లో సూర్యాస్తమయం సమయానికి ముందు చంద్రుడు అస్తమించడం వంటి పరిస్థితుల వల్ల మార్చి 18న నెలవంక కనిపించడం కష్టమని కూడా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి పరిస్థితిలో రంజాన్ మాసం పూర్తి 30 రోజులు కొనసాగి తర్వాత ఈద్ జరుపుకునే అవకాశం ఉంటుంది.

భారతదేశానికి సంబంధించి కూడా ఖగోళ నిపుణులు కొన్ని అంచనాలు వెల్లడించారు. ఫిబ్రవరి 19న ఉపవాసాలు ప్రారంభమైన దేశాలలో రంజాన్ ముగింపు సమయం మార్చి చివర్లోనే ఉండే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. భారతదేశంలో మార్చి 19న నెలవంక కనిపించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. నెలవంక దర్శనం జరిగితే మార్చి 20న ఈద్ పండుగ జరుపుకునే అవకాశం ఉంది. అయితే ఆ రోజున చంద్రవంక కనిపించకపోతే రంజాన్ మాసం మరో రోజు కొనసాగి మార్చి 21న ఈద్ జరుపుకునే అవకాశం ఉందని ముస్లిం మత పెద్దలు చెబుతున్నారు. మొత్తంగా ఈ సంవత్సరం భారతదేశంలో రంజాన్ ఈద్ మార్చి 20 లేదా మార్చి 21 తేదీల్లో జరగవచ్చని భావిస్తున్నారు.

NOTE: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా తెలియజేయడం జరిగింది. నమ్మడం, నమ్మకపోవడం మీ వ్యక్తిగత విషయం. స్టార్ త్రినేత్రం దీనికి అధికారికంగా ధృవీకరించట్లేదు.

ALSO READ: Scheme: పీఎం కిసాన్ మీకు రాలేదా?.. ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదు చేస్తే..
🏠 Home