Scheme: పీఎం కిసాన్ మీకు రాలేదా?.. ఈ హెల్ప్ లైన్ నెంబర్లకు ఫిర్యాదు చేస్తే..
Scheme: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల రైతులకు ముఖ్యమైన సహాయం అందించే పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. మార్చి 13న అస్సాంలోని గువహతిలో జరిగిన కార్యక్రమంలో ఈ నిధులను విడుదల చేయగా, దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యాయి. ఈ విడతలో సుమారు 22వ విడత కింద కేంద్ర ప్రభుత్వం రూ.18,640 కోట్లను విడుదల చేసింది. దాదాపు 9 కోట్ల 32 లక్షల మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున నిధులు జమ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
అయితే కొంతమంది రైతుల పేర్లు లబ్దిదారుల జాబితాలో ఉన్నప్పటికీ వారి ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని సమాచారం వస్తోంది. అలాంటి రైతులకు కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసే అవకాశం కల్పించింది. లబ్దిదారుల జాబితాలో పేరు ఉండి కూడా డబ్బులు రాకపోతే ప్రత్యేక సహాయ కేంద్రాల ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ సంఖ్యలను కూడా అందుబాటులో ఉంచింది. రైతులు 155261, 1800115526 లేదా 01123381092 అనే సంఖ్యలకు కాల్ చేసి తమ సమస్యను తెలియజేయవచ్చు. అదేవిధంగా అధికారిక మెయిల్ చిరునామా ద్వారా కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. తమకు డబ్బులు ఎందుకు రాలేదో తెలుసుకుని సమస్యను పరిష్కరించుకుంటే తర్వాతి విడతలో లేదా సరిదిద్దిన తర్వాత నిధులు ఖాతాలో జమ అయ్యే అవకాశం ఉంటుంది.
కొంతమంది రైతులకు డబ్బులు రాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయకపోతే నిధులు నిలిచిపోవచ్చు. ప్రతి సంవత్సరం ఒకసారి పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈకేవైసీ ప్రక్రియను నవీకరించాల్సి ఉంటుంది. ఇది చేయకపోతే డబ్బులు జమ కాకపోవచ్చు. అదేవిధంగా బ్యాంకు ఖాతా వివరాల్లో లోపాలు ఉన్నా నిధులు నిలిచిపోతాయి. బ్యాంకు ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయకపోవడం కూడా ఒక కారణంగా ఉండొచ్చు. అలాగే భూమి రికార్డుల్లో పొరపాట్లు ఉన్నా పథకం ప్రయోజనం అందకపోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ పథకం ద్వారా రైతులకు భారీగా ఆర్థిక సహాయం అందించింది. మొత్తం రూ.4.09 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు సమాచారం. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం చిన్న, సన్నకారు రైతులకు రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్నారు. ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. ఐదు ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులుగా పరిగణిస్తారు. ఆదాయ పన్ను చెల్లించే వారు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఎక్కువ భూమి ఉన్న వారు ఈ పథకానికి అర్హులు కారు. ఇటీవల కొంతమంది అనర్హుల పేర్లను కేంద్ర ప్రభుత్వం లబ్దిదారుల జాబితా నుంచి తొలగించినట్లు కూడా సమాచారం. అర్హత ఉన్న రైతులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకుని ఈ పథకం ప్రయోజనాన్ని పొందవచ్చు.
ALSO READ: కుక్క పిల్లను ఒడిలో పడుకోబెట్టుకుని అమ్మ ప్రేమను పంచిన వానరం!