Muhammad Ayub: ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన వరంగల్ డీసీసీ అధ్యక్షులు
Muhammad Ayub: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని వరంగల్ నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. నగరంలోని చింతల్ ప్రాంతంలో ఉన్న జామియా మసీద్ వద్ద వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముస్లిం సోదరులు, మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఉపవాసం ముగించుకున్న అనంతరం అందరూ కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా మసీదు ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ప్రత్యేక ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా మాట్లాడిన మహమ్మద్ అయూబ్.. పవిత్ర రంజాన్ మాసం త్యాగం, సహనం, దాతృత్వం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ఈ పవిత్ర మాసం మనుషుల మధ్య స్నేహభావాన్ని పెంపొందించే ముఖ్యమైన సమయం అని ఆయన పేర్కొన్నారు. సమాజంలో అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో, సౌహార్దంతో కలిసి జీవించాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. రంజాన్ మాసం ఇచ్చే సందేశం ప్రేమ, సేవ, సహకారం అని పేర్కొంటూ ప్రజలు పరస్పరం సహాయ సహకారాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
ఇఫ్తార్ విందు కార్యక్రమం అనంతరం స్థానిక నాయకులు, మసీదు కమిటీ సభ్యులు మహమ్మద్ అయూబ్‌ను శాలువాతో సన్మానించారు. ఆయన సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు, మసీదు కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షుడు ఎస్కే సోహెల్, సీనియర్ నాయకులు కరాటే ప్రభాకర్, కమాలోద్దీన్, అరెల్లి రవి, ఎస్కే తజమ్ముల్ ఖాన్, అంజద్, సోహెల్, బారి, సిరాజ్, అక్రమ్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ALSO READ: Bad News: భారీగా పెరగనున్న వాటర్ బాటిల్స్ రేట్లు