🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 13 March 2026, 8:42 pm Posted by : STAR TRINETHRAM

Bad News: భారీగా పెరగనున్న వాటర్ బాటిల్స్ రేట్లు

News Image
Bad News: పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలోని ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్స్ మార్కెట్‌పైనా ప్రభావం చూపుతున్నట్లు తాజా నివేదికలు సూచిస్తున్నాయి. ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా చమురు సరఫరాలో అంతరాయాలు ఏర్పడటం వల్ల పలు రంగాలపై ప్రభావం పడుతోంది. ఈ ప్రభావం ఇప్పుడు భారతదేశంలోని సుమారు 5 బిలియన్ డాలర్ల విలువైన ప్యాకేజ్డ్ తాగునీటి బాటిల్ మార్కెట్‌పైనా పడుతున్నట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదికలో వెల్లడైంది. ముఖ్యంగా వేసవి కాలం దగ్గరపడుతున్న సమయంలో ఈ పరిణామాలు వినియోగదారుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.

ఈ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో చమురు ధరలు పెరగడం ప్రారంభమైంది. చమురు ఆధారిత ఉత్పత్తులైన ప్లాస్టిక్ తయారీకి అవసరమైన ముడి పదార్థాల ధరలు భారీగా పెరిగాయి. ప్యాకేజ్డ్ తాగునీటి బాటిళ్లు తయారు చేయడానికి ఉపయోగించే ప్లాస్టిక్ బాటిళ్లు, మూతలు, లేబుల్స్, కార్డ్‌బోర్డ్ పెట్టెల తయారీ ఖర్చులు గణనీయంగా పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా పనిచేస్తున్న చిన్న తరహా తయారీ సంస్థలు ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో దాదాపు 2000 వరకు చిన్న కంపెనీలు డిస్ట్రిబ్యూటర్లకు అందించే బాటిల్ ధరను ఇప్పటికే 1రూపాయి వరకు పెంచినట్లు సమాచారం.

ప్యాకేజ్డ్ తాగునీటి తయారీలో ప్రధాన పాత్ర పోషించే పాలిమర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. ప్రస్తుతం కిలోకు సుమారు రూ.170 వరకు చేరినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గతంతో పోలిస్తే ఇది దాదాపు 50 శాతం పెరుగుదలగా భావిస్తున్నారు. ప్లాస్టిక్ బాటిల్ తయారీలో ఉపయోగించే మూతల ధరలు కూడా పెరిగి సుమారు 0.45 పైసలకు చేరినట్లు సమాచారం. ముడి పదార్థాల ధరలు పెరగడంతో తయారీ వ్యయం మరింతగా పెరుగుతుందని కంపెనీలు చెబుతున్నాయి.

ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఒక లీటర్ తాగునీటి బాటిల్ సగటుగా రూ.20కి విక్రయిస్తున్నారు. అయితే తయారీ ఖర్చులు పెరుగుతున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఈ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా వేసవి కాలంలో తాగునీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో ధరల పెరుగుదల వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా దేశంలో భూగర్భ జలాల కలుషిత సమస్య కూడా ప్యాకేజ్డ్ తాగునీటి వినియోగాన్ని పెంచింది. పరిశోధనల ప్రకారం దేశంలోని భూగర్భ జలాల్లో సుమారు 70 శాతం వరకు కలుషితమై ఉన్నాయని చెబుతున్నారు. ఈ కారణంగా దేశంలోని సుమారు 140 కోట్ల మంది ప్రజల్లో పెద్ద శాతం మంది ప్యాకేజ్డ్ తాగునీటిపైనే ఆధారపడుతున్నారు. అందువల్ల తాగునీరు ఇప్పుడు విలాస వస్తువుగా కాకుండా అవసరమైన మౌలిక అవసరంగా మారిందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

ప్రస్తుతం దేశంలోని ప్యాకేజ్డ్ తాగునీటి మార్కెట్లో అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయి. పెద్ద కంపెనీలు తయారీ ఖర్చులు పెరిగినా తాత్కాలికంగా ధరలను నియంత్రించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ చిన్న కంపెనీలు మాత్రం ధరలు పెంచక తప్పని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే రోజుల్లో తాగునీటి బాటిల్ ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ALSO READ: Sun Blessings: ఈ గ్రహ రాజు అనుగ్రహం ఉన్నవారికి కెరీర్, ఆర్థిక విషయాల్లో పురోగతి
🏠 Home