CI Sridhar Rao: మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం
CI Sridhar Rao: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మసాగర్ గ్రామంలోని జిల్లా పరిషత్ బాలికల పాఠశాలలో మాదకద్రవ్యాల నిర్మూలనపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నార్కోటిక్ ఎస్సై లోకం సందీప్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీస్తుందని హెచ్చరించారు.
విద్యార్థులు అలాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల నిర్మూలనలో విద్యార్థుల పాత్ర అత్యంత కీలకమని తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్య సమస్యలు, సమాజంపై వాటి ప్రతికూల ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ సర్పంచ్ మాచర్ల జ్యోతి ఏలియా, ఎస్సైలు నర్సింగరావు, దిలీప్, పోలీస్ సిబ్బంది, రవీందర్ చారి, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు గంగారపు శ్రీనివాస్, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ALSO READ: CI Pulyala Kishan: మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు