TDB: శబరిమల ఆలయంలో మహిళలకు నో ఎంట్రీ
TDB: కేరళ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆచారాలు, సంప్రదాయాల పరిరక్షణపై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆలయ పరిపాలనా సంస్థ అయిన ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు సంప్రదాయ విధానాలనే కొనసాగించాలనే నిర్ణయాన్ని వెల్లడించింది. ఆలయ పవిత్రత, ఆచార వ్యవస్థలను కాపాడటం తమ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేస్తూ మహిళల ప్రవేశ అంశంలో పాత సంప్రదాయాలకే మద్దతు తెలపాలని నిర్ణయించింది. ఈ మేరకు 14 మార్చి లోగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని సమావేశంలో తీర్మానించారు.
2018లో సుప్రీంకోర్టు అన్ని వయసుల మహిళలకు శబరిమల ఆలయంలో ప్రవేశం కల్పిస్తూ చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ తీర్పు దేశవ్యాప్తంగా విస్తృత చర్చకు దారితీసింది. మహిళల హక్కులు, మత స్వేచ్ఛ, సంప్రదాయ పరిరక్షణ వంటి అంశాలపై పెద్ద ఎత్తున వాదోపవాదాలు జరిగాయి. అనేక ప్రాంతాల్లో నిరసనలు వ్యక్తమవగా, పలు పునఃసమీక్ష పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ప్రస్తుతం ఆ పిటిషన్లు సుప్రీంకోర్టు పరిధిలో పరిశీలనలో కొనసాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు తన వైఖరిలో మార్పు చూపిస్తూ సంప్రదాయాల పరిరక్షణ వైపు మొగ్గు చూపడం ప్రాధాన్యత సంతరించుకుంది. మండలిలో ఈ అంశంపై ఎటువంటి భిన్నాభిప్రాయాలు లేవని సభ్యులు స్పష్టం చేశారు. దేవాలయ పవిత్రతను, పురాతన ఆచార వ్యవస్థను కాపాడటమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. గత తీర్పును సవాలు చేస్తూ అఫిడవిట్ సమర్పించనున్నట్లు వివరించారు. శబరిమల అంశం మత విశ్వాసాలు, రాజ్యాంగ హక్కులు, సామాజిక సమానత్వం వంటి సున్నితమైన అంశాలతో ముడిపడి ఉండటంతో ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది.
ALSO READ: CM Revanth Reddy: దేశం కోసమైనా రాహుల్ గాంధీ ప్రధాని కావాలి