Renu Desai: ఇదేనా మీ అమ్మానాన్న నేర్పిన సంస్కారం?.. ట్రోలర్స్‌పై రేణూ దేశాయ్ ఫైర్ (VIDEO)
Renu Desai: సోషల్ మీడియాలో తనపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై నటి రేణూ దేశాయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ ఖాతాలు తెరిచి ప్రతిరోజూ నీచ పదజాలంతో దూషిస్తున్నారని, దేవి మాలలో ఉన్న తనను కూడా అవమానించే రీతిలో ప్రశ్నలు వేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వ్యక్తిగత జీవితం, కుటుంబ విషయాలు, ఆర్థిక అంశాలు, రాజకీయ అభిప్రాయాలు అంటూ ఏ అంశాన్నీ వదలకుండా తనపై ఆరోపణలు చేస్తూ దూషిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసే ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారి ఇంటి వద్దకు వెళ్లి వారి తల్లిదండ్రుల సమక్షంలో నిలబెడతానని గట్టిగా హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఆమె రెండు వీడియో సందేశాలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో విడుదల చేశారు.
View this post on Instagram
A post shared by renu desai (@renuudesai)
తన జీవితంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని, ముఖ్యంగా 2012లో విడాకులు తీసుకున్న తర్వాత తనపై విమర్శలు మరింత పెరిగాయని ఆమె తెలిపారు. విడాకులు, భరణం, వ్యక్తిగత జీవితం, రాజకీయ అనుబంధాలు వంటి విషయాలపై ఆధారంలేని కథనాలు సృష్టించి తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆమె అన్నారు. ఇప్పటి వరకు వినడానికి ఏమీ మిగలలేదనుకున్నానని, అయితే ఈ సంవత్సరం జనవరిలో వీధి కుక్కల సంరక్షణపై నిర్వహించిన సమావేశం తర్వాత పరిస్థితి మరింత దిగజారిందని ఆమె వెల్లడించారు. మొదట తాను ఆ సమావేశానికి హాజరుకావడానికి ఆసక్తి చూపలేదని, మాట్లాడితే విమర్శలు తప్ప ప్రయోజనం ఉండదని ముందుగానే చెప్పానని వివరించారు. అయినప్పటికీ మూగజీవాల రక్షణ కోసం రావాల్సిందేనని ఒత్తిడి చేయడంతో పాల్గొన్నానని తెలిపారు.
వందలాది కుక్కలను చంపేస్తున్న ఘటనలు తనను కలచివేశాయని, 100 కుక్కల్లో 10 ప్రమాదకరంగా ఉండవచ్చని, వాటిపై జాగ్రత్తలు అవసరమని చెప్పానని ఆమె స్పష్టం చేశారు. కానీ మిగిలిన 90 నిరపరాధ జంతువులను హతమార్చడం సరైంది కాదని మాత్రమే తన అభిప్రాయం అని పేర్కొన్నారు. తన మాటలను వక్రీకరించి అసభ్యంగా దూషించడం అన్యాయమని అన్నారు. మనుషులు చేసినా జంతువులు చేసినా తప్పు తప్పేనని, కానీ పరిష్కారం హింస కాదని తాను చెప్పానని వెల్లడించారు.
మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉన్నదని, తన దుస్తులు, నటన, అభిప్రాయాలపై విమర్శలు చేయవచ్చని, కానీ వ్యక్తిగత జీవితాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని ఆమె స్పష్టం చేశారు. ముఖం చూపించకుండా తప్పుడు పేర్లతో ఖాతాలు తెరిచి బూతులు తిట్టడం సంస్కారం కాదని అన్నారు. ఒకసారి తాము చేసే వ్యాఖ్యలను తమ కుటుంబ సభ్యులకు చూపించగలరా అని ఆమె ప్రశ్నించారు. ఒక సమావేశంలో తనను అవమానించిన వ్యక్తిపై స్పందించగా, తన కోపాన్నే పెద్దది చేసి చూపించి అసలు సంఘటనను విస్మరించారని పేర్కొన్నారు. మహిళలూ పురుషులూ అనే తేడా లేకుండా అసభ్య పదజాలం ఉపయోగించడం బాధాకరమని అన్నారు.
తాను మూగజీవాల కోసం సేవ చేస్తున్నానని, ప్రతి సమస్యకూ తానే బాధ్యత వహించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులను ప్రశ్నించాల్సిన విషయాల్లో తనను ఎందుకు నిలదీస్తున్నారని ప్రశ్నించారు. తాను కూడా ఈ దేశంలో ఒక సాధారణ పౌరురాలినేనని, సినిమా రంగంలో ఉండటం మాత్రమే తేడా అని చెప్పారు. ఎవరికైనా అసభ్యంగా మాట్లాడితే.. అది వారి వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని హెచ్చరించారు.
ఇకపై వేధింపులు ఎదురైతే ఎవరినీ వదిలిపెట్టబోనని ఆమె గట్టిగా తెలిపారు. నకిలీ ఖాతాల వెనుక దాగి దూషించే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకునేలా చేస్తానని హెచ్చరించారు. అవసరమైతే వారి కుటుంబ సభ్యుల ముందే వారి ప్రవర్తనను బయటపెడతానని అన్నారు. సోషల్ మీడియాలో సంయమనం పాటించాలని, అసభ్య వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
ALSO READ: Matchbox vastu: పూజ గదిలో అగ్గిపెట్టే అస్సలు పెట్టకండి!.. ఎందుకో తెలుసా?