🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 28 February 2026, 8:12 pm Posted by : STAR TRINETHRAM

Ayyappa Temple: ముల్కనూర్‌లో ఆధ్యాత్మిక ఉత్సాహం

News Image
* శ్రీ విశ్వేశ్వర సహిత అయ్యప్ప ఆలయంలో ప్రత్యేక కార్యక్రమం

* హనుమాన్ చాలీసా పారాయణంతో మారుమోగిన దేవాలయం

స్టార్ త్రినేత్రం, హన్మకొండ: హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండల పరిధిలోని ముల్కనూర్ గ్రామంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర సహిత అయ్యప్ప ఆలయం శనివారం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. గ్రామ ప్రజల సమిష్టి భాగస్వామ్యంతో ఆలయ ప్రాంగణంలో భక్తి భావనల నడుమ హనుమాన్ చాలీసా పారాయణం ఘనంగా నిర్వహించారు. భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

అనంతరం సమిష్టిగా భక్తులు కూర్చొని హనుమాన్ చాలీసాను గంభీర స్వరాలతో పారాయణం చేశారు. ప్రతి శ్లోకం ఆలపించినప్పుడు ఆలయ ప్రాంగణం మొత్తం మారుమోగి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.

ALSO READ: Devotional: పుణ్య క్షేత్రాన్ని దర్శించుకున్నాక నేరుగా ఇంటికే వెళ్లలా?
🏠 Home