Morning Diet: ఉదయాన్నే ఈ 4 ఆహారాలను అస్సలు తినకండి.. ఆరోగ్యానికి ప్రమాదం!
Morning Diet: ఉదయం కళ్లు తెరిచిన క్షణం నుంచి చాలా మందికి జీవితమే పరుగు పందెంలా మారిపోతుంది. పనుల ఒత్తిడి, సమయాభావం, ఆఫీస్‌కి ఆలస్యమవుతుందనే ఆందోళన మధ్య అల్పాహారం విషయంలో నిర్లక్ష్యం పెరుగుతోంది. ఏదో ఒకటి తిన్నామా లేదా అన్నట్టుగా తొందరలో పడిన ఆహారపు అలవాట్లు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఖాళీ కడుపుతో తీసుకునే కొన్ని పదార్థాలు దీర్ఘకాలంలో జీర్ణ సమస్యలకు దారితీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఉదయాన్నే సరైన ఆహారం తీసుకోకపోవడం వలన కడుపులో ఆమ్ల ఉత్పత్తి అసమతుల్యంగా మారుతుంది. దీనివల్ల గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మొదలై క్రమంగా బరువు పెరగడం, శరీరంలో కొవ్వు పేరుకుపోవడం జరుగుతుంది. దీర్ఘకాలంలో మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలకు కూడా ఇది పరోక్ష కారణమవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.
చాలామంది లేవగానే నేరుగా కాఫీ లేదా టీ తాగడం అలవాటు చేసుకుంటారు. అయితే ఖాళీ కడుపుతో వీటిని తీసుకోవడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముందుగా కనీసం ఒక గ్లాసు నీరు తాగి తరువాతే కాఫీ లేదా టీ తీసుకోవాలి. లేకపోతే కడుపులో ఆమ్లం అధికంగా ఉత్పత్తి అయి గ్యాస్, అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటుంది.
అలాగే ఉదయం పూట స్పైసీ పదార్థాలు తినడం కూడా నివారించాలి. బ్రష్ చేసిన వెంటనే నీళ్లు కూడా తాగకుండా కారంగా ఉండే ఆహారం తీసుకుంటే కడుపు గోడలకు హాని కలగవచ్చు. దీనివల్ల యాసిడ్ రిఫ్లెక్స్, అజీర్తి, మంట వంటి సమస్యలు రావచ్చు. సిట్రస్ ఫలాలను కూడా ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కొంతమందికి ఆమ్లత్వం పెరిగే ప్రమాదం ఉంది.
అత్యధిక తీపి ఉన్న పదార్థాలు, చక్కెర పానీయాలు, గ్యాస్ కలిగిన శీతల పానీయాలు, వేయించిన పదార్థాలు ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం. ఇవి జీర్ణక్రియను మందగించి శరీరంలో కొవ్వు నిల్వలను పెంచే అవకాశముంది. అలానే కొన్ని సందర్భాల్లో ఓట్స్, గుడ్లు, గ్రీన్ టీ, బెర్రీలు వంటి పదార్థాలను కూడా ప్రతి ఒక్కరి శరీర స్వభావాన్ని బట్టి మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉదయం అల్పాహారం సమతుల్యంగా ఉండాలి. గోరువెచ్చని నీరు, తేలికపాటి ఆహారం, తక్కువ మసాలా, తక్కువ చక్కెర ఉండే పదార్థాలు తీసుకుంటే రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు. శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా ఆహారాన్ని ఎంపిక చేసుకోవడం ఎంతో ముఖ్యమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు.
ALSO READ: Odisha: 23 ఏళ్ల యువతిపై ప్రియుడు సహా ఇద్దరు అత్యాచారం.. ఆపై మరో ఘోరం