wedding season: పెళ్లిళ్ల సీజన్‌లో పెరిగిన బంగారం ధరలు.. స్థిరంగా వెండి ధరలు
wedding season: ఇంట్లో చిన్నపాటి శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయడం తెలుగు కుటుంబాల్లో సాంప్రదాయంగా మారిపోయింది. ముఖ్యంగా ఫిబ్రవరి నెల మొదలైన వెంటనే పెళ్లిళ్ల సీజన్ జోరందుకోవడంతో పసిడి కొనుగోళ్లకు డిమాండ్ మరింత పెరిగింది. పెళ్లి అనగానే ముందుగా గుర్తొచ్చేది బంగారం, వెండి నగలే. వధూవరుల కోసం ప్రత్యేకంగా ఆభరణాలు తయారు చేయించడం, కుటుంబ సభ్యులకు కానుకలు కొనడం వంటి కారణాలతో మార్కెట్‌లో లావాదేవీలు చురుకుగా సాగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా అంతర్జాతీయ పరిణామాలు, డాలర్ మార్పిడి విలువలు, దిగుమతుల వ్యయభారం వంటి కారణాల ప్రభావంతో బంగారం, వెండి ధరలు ఎగిసిపడుతున్నాయి. ఒక రోజు స్వల్పంగా తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిస్తే, మరుసటి రోజు మళ్లీ పెరిగి ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మార్పులతో వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు.
ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 27న బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ నగరాల్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.1,61,020గా ఉండగా, నేడు రూ.550 పెరిగి రూ.1,65,570కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.1,47,600గా ఉండగా, నేడు రూ.500 పెరిగి రూ.1,48,100గా నమోదైంది. పెళ్లిళ్ల సీజన్ నడుమ ఈ పెరుగుదల కొనుగోలుదారులపై అదనపు భారం మోపుతోంది. బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదలైనా పెద్ద మొత్తంలో కొనుగోళ్లు చేసే కుటుంబాలకు ఇది గణనీయమైన వ్యయంగా మారుతోంది.
ఇక వెండి ధరలు మాత్రం నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. కిలో వెండి ధర రూ.2,95,000 వద్దనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపు ఇదే ధరలు కొనసాగుతున్నట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. వెండి ఆభరణాలు, పూజా సామగ్రి, పెళ్లి కానుకల కోసం వెండి వస్తువుల కొనుగోళ్లు కూడా ఈ కాలంలో ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ బంగారం ధరల పెరుగుదలతో పోలిస్తే వెండి ధరలు కొంత స్థిరత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి.
మొత్తానికి పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు తగ్గుతాయనే అంచనాలు ఈసారి నిజం కాలేదు. మార్కెట్ ధోరణులు ఎటు తిరుగుతాయో అంచనా వేయడం కష్టమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పెట్టుబడిదారుల ధోరణులు, దేశీయ డిమాండ్ వంటి అంశాలు రాబోయే రోజుల్లో ధరలపై ప్రభావం చూపనున్నాయి. బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు మార్కెట్ పరిస్థితులను గమనించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ALSO READ: Meghalaya: అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో భార్యాభర్తల ముసిముసి నవ్వులు