Road Safety Cess: భారీగా పెరగనున్న వాహనాల ధరలు.. ఎప్పటినుంచో తెలుసా?
Road Safety Cess: రాష్ట్రంలో కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి షాకిచ్చేలా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రహదారి ప్రమాదాలను తగ్గించి భద్రత ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో ‘రహదారి భద్రత పన్ను’ పేరుతో కొత్త సెస్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త నిబంధన 1 మార్చి 2026 నుంచి అమల్లోకి రానుంది. ఆ తేదీ తర్వాత రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ చేసుకునే కొత్త వాహనాలపై ఈ పన్ను తప్పనిసరిగా వర్తించనుంది.
ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కార్లు, ప్రయాణికులను రవాణా చేసే ఆటోలు, ఇతర వ్యక్తిగత వినియోగ వాహనాలపై ఈ సెస్ విధించబడుతుంది. వాహనాల వర్గీకరణ ఆధారంగా పన్ను మొత్తాన్ని నిర్ణయించారు. ద్విచక్ర వాహనాలపై రూ.2,000, తేలికపాటి మోటారు వాహనాలపై రూ.5,000, ఇతర వర్గాల వాహనాలపై రూ.10,000 చొప్పున సెస్ వసూలు చేయనున్నారు. కార్లు తేలికపాటి వాహనాల విభాగంలోకి వస్తాయి. 4 నుంచి 7 సీట్ల సామర్థ్యం కలిగిన ప్రయాణికుల ఆటోలు ఇతర వాహనాల వర్గంలోకి చేరతాయి.
వాహనం రిజిస్ట్రేషన్ సమయంలోనే ఈ రహదారి భద్రత పన్నును తప్పనిసరిగా చెల్లించాల్సి ఉంటుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిచేయాలంటే ఈ సెస్ చెల్లింపు అనివార్యంగా మారుతుంది. భద్రతా చర్యలను బలోపేతం చేయడానికి, రహదారి మౌలిక వసతుల అభివృద్ధికి ఈ నిధులను వినియోగించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
ఈ సెస్ అమలు ద్వారా రాష్ట్ర ఖజానాకు సంవత్సరానికి సుమారు రూ.270 కోట్ల అదనపు ఆదాయం సమకూరనుందని అంచనా వేస్తున్నారు. పెరుగుతున్న వాహనాల సంఖ్య, రహదారులపై పెరుగుతున్న రద్దీ నేపథ్యంలో భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడం అత్యవసరమని ప్రభుత్వం భావిస్తోంది. అయితే కొత్త వాహనాల కొనుగోలుదారులకు ఇది అదనపు ఆర్థిక భారం అవుతుందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ALSO READ: Pension: రూ.500 పెంచే యోచనలో సర్కార్!