🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 21 February 2026, 8:48 pm Posted by : STAR TRINETHRAM

Tragedy: అయ్యో తల్లీ.. ఎందుకిలా చేశావమ్మా!

News Image
Tragedy: ఒంటరి జీవిత భారాన్ని మోయలేక ఓ తల్లి తీసుకున్న నిర్ణయం రెండు ప్రాణాలను బలిగొంది. వికారాబాద్ జిల్లా పరిధిలోని యాలాల పోలీస్ స్టేషన్ పరిధి ఇందిరమ్మ కాలనీలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భర్తతో విడిపోయి కొడుకుతో ఒంటరిగా జీవిస్తున్న మహిళ, ఆరేళ్ల బాలుడిని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసి అనంతరం తానూ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

ఎస్సై విఠల్ రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందిరమ్మ కాలనీకి చెందిన బుడగ జంగం గౌరమ్మ (30) తాండూరు పట్టణానికి చెందిన ఫిరోజ్‌ను ప్రేమించి వివాహం చేసుకుంది. ఈ దంపతులకు రవికాంత్ (6) అనే కుమారుడు ఉన్నాడు. అయితే భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తడంతో రెండేళ్ల క్రితం విడిపోయారు. అప్పటి నుంచి గౌరమ్మ తన కుమారుడితో కలిసి ఇందిరమ్మ కాలనీలోని బ్లాక్ నెంబరు 28లోని గదిలో నివసిస్తోంది. అదే ప్రాంతంలో ఆమె తల్లిదండ్రులు, అన్నదమ్ములు వేరే గదిలో ఉంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు. అవసరమైనప్పుడు అన్నదమ్ములతో కలిసి కూలీ పనులకు వెళ్లి జీవనోపాధి సాగించేది.

రవికాంత్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకూ గౌరమ్మ, రవికాంత్ బయటకు రాకపోవడంతో అనుమానం కలిగిన ఆమె అన్న తుల్జారం గదివద్దకు వెళ్లాడు. తలుపు లోపల నుంచి మూసి ఉండటంతో పలుమార్లు నెట్టినా తెరుచుకోలేదు. చివరకు తలుపు పగులగొట్టి లోపలికి వెళ్లగా, బాలుడు సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. మరో వైపు గౌరమ్మ కూడా ఉరేసుకున్న స్థితిలో కనిపించడంతో కుటుంబసభ్యులు షాక్‌కు గురయ్యారు.

జీవితంపై విరక్తితోనే గౌరమ్మ ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉంటుందని, ఎవరిపైనా అనుమానం లేదని కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించనున్నట్లు తెలిపారు.

జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా ఆత్మహత్య శాశ్వత పరిష్కారం కాదని స్థానికులు చెబుతున్నారు. మానసిక ఒత్తిడి, ఒంటరితనం వంటి సమస్యలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులు, స్నేహితులు లేదా నిపుణులను సంప్రదించడం ద్వారా సహాయం పొందవచ్చు.

ALSO READ: Banda Court: 33 మంది అబ్బాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డ దంపతులు.. సంచలన తీర్పు
🏠 Home