Banda Court: 33 మంది అబ్బాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డ దంపతులు.. సంచలన తీర్పు
Banda Court: సమాజాన్ని కుదిపేసిన ఘోర లైంగిక దాడుల కేసులో కఠిన తీర్పు వెలువడింది. ఉత్తరప్రదేశ్‌లోని బాందా ప్రత్యేక పోక్సో కోర్టు.. ప్రభుత్వ అధికారితో పాటు ఆయన భార్యకు మరణశిక్ష విధిస్తూ సంచలన నిర్ణయం ప్రకటించింది. దాదాపు 33 మంది బాలురపై దశాబ్ద కాలంగా అమానుషంగా లైంగిక దాడులకు పాల్పడినట్లు తేలడంతో ఈ శిక్ష విధించినట్లు న్యాయస్థానం వెల్లడించింది. ఈ కేసును “అరుదైన వాటిలో అత్యంత అరుదైనది”గా అభివర్ణిస్తూ, నిందితుల చర్యలు మానవత్వానికే మచ్చతెచ్చాయని కోర్టు తీవ్రంగా వ్యాఖ్యానించింది.
దర్యాప్తు వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ నీటిపారుదల శాఖలో జూనియర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న రాంభవన్ మరియు ఆయన భార్య దుర్గావతి 2010 నుంచి 2020 మధ్యకాలంలో చిత్రకూట్ సహా పలు ప్రాంతాల్లో ఈ దారుణాలకు పాల్పడ్డారు. ఆన్‌లైన్ ఆటలు, డబ్బు, బహుమతుల ప్రలోభాలు చూపించి చిన్నారులను వలలో వేసుకుని, వారిపై లైంగిక దాడులు చేసినట్లు వెల్లడైంది. అంతేకాకుండా బాధితులతో అశ్లీల వీడియోలు చిత్రీకరించి వాటిని సోషల్ మీడియాలలో పోస్ట్ చేసినట్లు దర్యాప్తులో తేలింది. బాధితుల్లో మూడేళ్ల పసిపిల్లలు కూడా ఉండటం ఈ నేరాల తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది.
ఈ కేసును సీబీఐ 2020 అక్టోబర్ 31న నమోదు చేసి, 2021 ఫిబ్రవరి 10న నిందితులపై ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఐపీసీ, పోక్సో చట్టంలోని పలు కఠిన నిబంధనల కింద అభియోగాలు మోపి విచారణ కొనసాగింది. సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలు, డిజిటల్ ఆధారాలు పరిశీలించిన అనంతరం కోర్టు నిందితులను దోషులుగా తేల్చింది. నిందితుల నైతిక పతనం, నిర్దాక్షిణ్య స్వభావం, బాధితులపై పడిన మానసిక-శారీరక ప్రభావం దృష్ట్యా అత్యున్నత శిక్షే తగినదని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
లైంగిక దాడుల కారణంగా కొందరు చిన్నారులు తీవ్రమైన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందగా, మరికొందరికి శాశ్వత ఆరోగ్య సమస్యలు తలెత్తినట్లు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. అనేక మంది ఇప్పటికీ మానసిక వేదనతో బాధపడుతున్నారని తెలిపింది. దర్యాప్తు సమయంలో బాధిత చిన్నారులతో అధికారులు అత్యంత సున్నితంగా వ్యవహరించి, వారికి కౌన్సిలింగ్ అందించడంతో పాటు మానసిక స్థైర్యాన్ని కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.
బాధితుల పునరావాసం కోసం ప్రతి ఒక్కరికీ తలా రూ.10 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. అదేవిధంగా నిందితుల ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న నగదును కూడా బాధితులకు సమానంగా పంపిణీ చేయాలని సూచించింది. ఫోరెన్సిక్, వైద్య నిపుణులతో సమన్వయం చేసుకుంటూ సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించడంతోనే ఈ తీర్పు సాధ్యమైందని దర్యాప్తు సంస్థ పేర్కొంది.
ALSO READ: Mutual Funds: సరిపడా డబ్బులున్నా.. లోన్ తీసుకునే కారు కొనాలని నిపుణులు ఎందుకు చెబుతారో తెలుసా?