Commissioner CH Priyanka: జిల్లాస్థాయి అక్రెడిటేషన్ కమిటీలను వారం రోజులలో పూర్తి చేయాలి
Commissioner CH Priyanka: తెలంగాణ రాష్ట్రంలో పాత్రికేయుల గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. జిల్లాస్థాయి గుర్తింపు కమిటీల ఏర్పాటు పనులను గరిష్టంగా 7 రోజుల్లో పూర్తి చేయాలని ప్రత్యేక కమిషనర్ సీహెచ్ ప్రియాంక జిల్లా ప్రజా సంబంధాల అధికారులకు సూచించారు. రాజధాని హైదరాబాద్ నగరంలోని నాంపల్లి ప్రాంతంలో ఉన్న తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఈ మేరకు ఆమె దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా గుర్తింపు కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై సమగ్ర అవగాహన కలిగి ఉండాలని జిల్లా అధికారులకు ఆమె స్పష్టం చేశారు. జీఓ నెం 252, 103లలో పేర్కొన్న నిబంధనలను పూర్తిగా అధ్యయనం చేసి అమలు చేయాలని సూచించారు. ప్రతి జిల్లాలో జిల్లా కలెక్టర్ సమన్వయంతో స్థానిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డిజిటల్ మీడియా ప్రతినిధులను కలుపుకొని గుర్తింపు కమిటీని ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
గుర్తింపు కార్డుల ప్రక్రియలో భాగంగా దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, నివేదికల సిద్ధం, ఆమోద జాబితాల తుది రూపకల్పన, నమోదు సంఖ్యల కేటాయింపు, కార్డుల డౌన్‌లోడ్ తదితర అంశాలపై అధికారులు పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలని ఆమె పేర్కొన్నారు. అర్హత గల పాత్రికేయులకు పారదర్శకంగా, నిబంధనల ప్రకారం కార్డులు జారీ చేయాలని స్పష్టం చేశారు.
ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తుల పరిశీలన సమయంలో సాంకేతిక లేదా పరిపాలనా సమస్యలు ఎదురైతే వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యాలయంలోని మీడియా సంబంధ విభాగ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అవసరమైతే సాంకేతిక బృందాన్ని సంప్రదించి ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. పారదర్శకతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టంచేశారు.
ఈ శిక్షణా కార్యక్రమానికి రాష్ట్రంలోని 33 జిల్లాలకు చెందిన ప్రజా సంబంధాల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది హాజరయ్యారు. గుర్తింపు కార్డుల జారీకి సంబంధించిన ఆన్‌లైన్ విధానాన్ని ప్రదర్శన రూపంలో వివరిస్తూ సిబ్బందికి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అధికారులు లేవనెత్తిన సందేహాలకు సంబంధిత విభాగ అధికారులు సమగ్రంగా సమాధానాలు ఇచ్చారు.
అర్హత గల పాత్రికేయులు అధికారిక ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. ఏవైనా సందేహాలు ఉంటే 9154170881 నెంబర్‌ను సంప్రదించాలని అధికారులు తెలియజేశారు. జిల్లాస్థాయిలో కమిటీల ఏర్పాటు పూర్తయిన వెంటనే గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ వేగవంతం అవుతుందని తెలిపారు.
ALS0 READ: Indian Navy: పరీక్ష లేకుండానే ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది!