🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 19 February 2026, 2:14 pm Posted by : STAR TRINETHRAM

Indian Navy: పరీక్ష లేకుండానే ఉద్యోగాలు.. నోటిఫికేషన్ వచ్చేసింది!

News Image
Indian Navy: దేశ సేవ చేయాలనే సంకల్పం ఉన్న యువతకు శుభవార్త. భారత నౌకాదళంలో 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామకాల్లో ప్రత్యేకత ఏమిటంటే.. ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ఎంపిక ప్రక్రియ చేపడుతున్నారు. అభ్యర్థుల విద్యార్హతలు, అకడమిక్ ప్రతిభ, ఇంటర్వ్యూ ప్రదర్శన, మెడికల్ టెస్ట్‌ అర్హత ఆధారంగా తుది ఎంపిక చేయనున్నారు. దీంతో పోటీ పరీక్షల ఒత్తిడి లేకుండా నేరుగా అధికారిగా చేరే అవకాశంగా యువత దీన్ని భావిస్తోంది.

పోస్టును బట్టి అభ్యర్థులు డిగ్రీ, ఇంజినీరింగ్ లేదా పీజీ విద్యార్హతలు కలిగి ఉండాలి. సంబంధిత విభాగానికి అనుగుణంగా విద్యార్హతలు మారుతాయి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు తప్పనిసరిగా ఉండాలి. ఎత్తు, బరువు, కంటి చూపు వంటి ప్రమాణాల్లో నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. ఈ నియామకాలకు అవివాహితులే అర్హులుగా పేర్కొన్నారు. దేశ రక్షణ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించగల శారీరక దృఢత్వం, మానసిక స్థైర్యం ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడం లక్ష్యంగా నౌకాదళం ముందుకు సాగుతోంది.

ఎంపికైన వారికి ప్రారంభ వేతనం సుమారు 1.25 లక్షల నుంచి 1.5 లక్షల వరకు ఉండనున్నట్లు తెలిపింది. వేతనంతో పాటు ఇతర భత్యాలు, సౌకర్యాలు కూడా వర్తిస్తాయి. దేశ సేవతో పాటు ఆకర్షణీయమైన వేతనం, గౌరవప్రదమైన హోదా కలిగిన ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి. పూర్తి వివరాలు, అర్హత ప్రమాణాలు, ఎంపిక విధానం వంటి సమాచారం అధికారిక వెబ్‌సైట్‌ https://www.joinindiannavy.gov.in/ లో అందుబాటులో ఉంది. దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్‌ను పూర్తిగా చదివి అర్హతలు పరిశీలించుకోవాలని సూచిస్తున్నారు.

ALSO READ: Pic Viral: గర్ల్‌ఫ్రెండ్‌తో పూల్‌లో హార్దిక్ పాండ్య
🏠 Home