Taliban New Act: భార్యలను భర్తలు కొట్టొచ్చు.. కానీ ఎముకలు విరక్కూడదు
Taliban New Act: భార్యలను తిట్టండి.. పిల్లలను కొట్టండి.. ఎలాంటి తప్పూ లేదు.. కానీ ఒక షరతు మాత్రం పాటించాలి.. ఎముకలు విరిగేంతగా మాత్రం హింసించకూడదు. వినడానికి నమ్మశక్యం కాని ఈ వాక్యాలు వాస్తవంగా చట్టపరమైన నిబంధనలుగా మారితే? ప్రపంచం 21వ శతాబ్దంలో ముందుకు దూసుకుపోతున్న వేళ ఇలాంటి చట్టాలు అమల్లోకి వస్తే? ఇదే పరిస్థితి ప్రస్తుతం ఆఫ్గనిస్తాన్‌లో నెలకొంది. తాలిబన్ పాలనలో కొత్తగా అమల్లోకి వచ్చిన 90 పేజీల క్రిమినల్ కోడ్ దేశంలోని మహిళల భవిష్యత్తుపై తీవ్ర చర్చకు దారితీసింది. తాలిబన్ సుప్రీం నేత హిబతుల్లా అఖుంద్జాదా ఆమోదంతో ఈ చట్టం అమలులోకి రావడం అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చకు దారితీసింది.
ఇప్పటికే చదువు, ఉపాధి, స్వేచ్ఛగా సంచరించే హక్కులను కోల్పోయిన ఆఫ్గాన్ మహిళలు ఇప్పుడు గృహ హింసను కూడా చట్టబద్ధంగా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. కొత్త నిబంధనల ప్రకారం భర్త తన భార్యపై శారీరక శిక్ష విధించినా అది నేరంగా పరిగణించబడదు. అయితే ఎముకలు విరగకూడదు, తీవ్రమైన గాయాలు కాకూడదు అనే పరిమితి మాత్రమే విధించారు. భార్యపై హింస జరిగినా, ఆమె స్వయంగా కోర్టుకు వెళ్లి తన గాయాలను న్యాయమూర్తికి చూపించినప్పుడే అది నేరంగా నమోదు అవుతుంది. అంతేకాకుండా, కోర్టుకు వెళ్లాలంటే ఆమెతో తప్పనిసరిగా ఒక పురుష సంరక్షకుడు ఉండాలి. ఆశ్చర్యకరమైన అంశం ఏమిటంటే, తనను హింసించిన అదే భర్తనే తోడుగా తీసుకుని కోర్టుకు వెళ్లాల్సిన విరుద్ధ పరిస్థితి మహిళల ముందుంది.
కొత్త చట్టంలో మరో కీలక అంశం శిక్షల పరిమితి. ఒకవేళ హింస రుజువైనప్పటికీ భర్తకు కేవలం 15 రోజుల జైలు శిక్ష మాత్రమే విధించబడుతుంది. అది కూడా బాధితురాలు సాక్ష్యాలతో నిరూపించిన తర్వాతే. ఈ విధానం గృహ హింస బాధితులకు న్యాయం అందించే బదులు, నేరస్తులకు రక్షణ కల్పించేలా ఉందని హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి. మహిళల శారీరక, మానసిక భద్రతపై ఈ చట్టం తీవ్రమైన ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ వేదికల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
మహిళల కదలికలపై కూడా కఠిన నియంత్రణలు అమలు చేస్తున్నారు. భర్త అనుమతి లేకుండా పుట్టింటికి వెళ్లినా, బంధువుల ఇంటికి వెళ్లినా ఆమెకు 3 నెలల జైలు శిక్ష విధించే నిబంధన చట్టంలో పొందుపరిచారు. గతంలో 2009లో అమల్లోకి వచ్చిన మహిళల రక్షణ చట్టాలను పూర్తిగా రద్దు చేశారు. దీంతో మహిళల హక్కుల పరిరక్షణకు ఉన్న చట్టపరమైన బలగాలు నిర్వీర్యమయ్యాయి. కుటుంబ సభ్యులు భర్త వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటే వారిపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.
శిక్షల అమల్లో సామాజిక హోదాకు ప్రాధాన్యం ఇవ్వడం మరో వివాదాస్పద అంశం. మత పెద్దలు లేదా ఉన్నత వర్గాలకు చెందిన వారు తప్పు చేసినా వారికి కఠిన శిక్షలు విధించకుండా సలహాలతోనే వదిలేస్తారని పేర్కొనబడింది. అయితే సామాన్యులు, దిగువ తరగతులకు చెందిన వారు తప్పు చేస్తే జైలు శిక్షతో పాటు కొరడా దెబ్బలు కూడా అమలు చేస్తారు. ఈ ద్వంద్వ వైఖరి దేశంలోని న్యాయ వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. జంతువులపై జరిగే కొన్ని నేరాలకు కఠిన శిక్షలు ఉండగా, మహిళలపై హింసకు తక్కువ శిక్ష ఉండటం చట్టంలోని క్రూరత్వాన్ని స్పష్టంగా చూపిస్తోంది.
అంతర్జాతీయ సమాజం ఇప్పటికే ఆఫ్గనిస్తాన్‌లో మహిళల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఐక్యరాజ్యసమితి ఈ పరిస్థితిని లింగ ఆధారిత వివక్షకు ఉదాహరణగా అభివర్ణించింది. కానీ అక్కడి మహిళలు మాత్రం మౌనంగా తమ జీవితాలు చీకటిలోకి జారిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కులు అన్న భావనలు కాగితాలపైనే మిగిలిపోతున్న ఈ పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ALSO READ: Trend: పెళ్లి కాకుండానే పేరెంట్స్‌గా మారుతున్న యువత