Supreme Court: దుస్తులు విప్పే ప్రయత్నం కూడా అత్యాచారయత్నమే
Supreme Court: లైంగిక నేరాల విచారణలో చట్టపరమైన విశ్లేషణతో పాటు బాధితురాలి పరిస్థితిని అర్థం చేసుకునే సానుభూతి కూడా అంతే ముఖ్యమని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది. దుస్తులు విప్పే ప్రయత్నం చేయడం, అసభ్యంగా తాకడం వంటి చర్యలను తేలికగా తీసుకోలేమని, ఇవి అత్యాచారయత్న పరిధిలోకే వస్తాయని దేశ అత్యున్నత న్యాయస్థానం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద తీర్పును రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. బాధితురాలిపై నిందితులు చేసిన చర్యలను కేవలం తాకడం లేదా పైజామా విప్పే ప్రయత్నంగా పరిమితం చేసి అత్యాచారం లేదా అత్యాచారయత్నంగా పరిగణించలేమన్న హైకోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. లైంగిక నేరాల విషయంలో న్యాయస్థానాలు సూక్ష్మ విషయాలను కూడా గంభీరంగా పరిగణించాలని సూచించింది.
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం, న్యాయమూర్తులు జోయ్ మల్య బాగ్చి, ఎన్వి అంజరియాలు సభ్యులుగా ఉన్న బెంచ్ ఈ అంశంపై విస్తృతంగా పరిశీలన జరిపింది. నేర స్వభావాన్ని అంచనా వేసేటప్పుడు కేవలం చివరి దశకు వెళ్లకపోయినంత మాత్రాన అది అత్యాచారయత్నం కాదని చెప్పడం సరైంది కాదని స్పష్టం చేసింది. బాధితురాలి దుస్తులు విప్పే ప్రయత్నం, ఆమెను బలవంతంగా కల్వర్టు కిందకు లాగడం, శరీర భాగాలను అసభ్యంగా తాకడం వంటి చర్యలు నేరపూరిత ఉద్దేశాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తాయని పేర్కొంది. లైంగిక దాడి కేసుల్లో బాధితురాలి మానసిక స్థితి, భయాందోళనలు, సంఘటన సందర్భం వంటి అంశాలను కూడా సమగ్రంగా పరిశీలించాల్సిన బాధ్యత కోర్టులపై ఉందని తెలిపింది.
ఈ కేసులో పవన్, ఆకాష్ అనే ఇద్దరు నిందితులు 11 ఏళ్ల బాలికను ఓ కల్వర్టు కిందకు తీసుకెళ్లి ఆమె శరీర భాగాలను తాకుతూ పైజామా విప్పే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అదే సమయంలో అక్కడికి వచ్చిన కొందరు వ్యక్తులు ఘటనను గమనించి వారిని అడ్డగించి పోలీసులకు అప్పగించారు. అనంతరం ట్రయల్ కోర్టు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది. అయితే నిందితులు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా, జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ్ మిశ్రా విచారణ జరిపి కీలక వ్యాఖ్యలు చేశారు. నిందితులు బాలిక దుస్తులు విప్పుతున్న సమయంలో పట్టుబడిన వెంటనే పారిపోయారని, అత్యాచారం జరిగిందని నిర్ధారించే స్పష్టమైన ఆధారాలు లేవని పేర్కొన్నారు. అంతేకాకుండా అత్యాచారయత్నం చేశారని తేల్చడానికి సమర్పించిన ఆధారాలు సరిపోవని అభిప్రాయపడ్డారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. లైంగిక నేరాలను అతి సున్నితంగా పరిగణించాల్సిన అవసరం ఉందని, చిన్నారి పైజామా విప్పే ప్రయత్నం, ఆమెను ఒంటరిగా తీసుకెళ్లడం వంటి చర్యలు నేర ఉద్దేశాన్ని స్పష్టంగా సూచిస్తున్నాయని తెలిపింది. నేరం పూర్తికాలేదని చెప్పి నిందితులను ఉపశమనం కల్పించడం చట్టసమ్మతం కాదని వ్యాఖ్యానించింది. లైంగిక దాడి కేసుల్లో సాంకేతిక కారణాలను ఆధారంగా చేసుకుని నిందితులకు లాభం కలిగించే విధంగా తీర్పులు ఇవ్వడం సమంజసం కాదని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అలహాబాద్ హైకోర్టు తీర్పును రద్దు చేస్తూ కేసును మళ్లీ సమగ్ర విచారణకు పంపింది. బాధితుల హక్కుల పరిరక్షణలో కోర్టులు మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
ALSO READ: Valio: భారత్‌లో రూ.2,100 కోట్ల పెట్టుబడులకు సిద్ధం