🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 February 2026, 9:24 pm Posted by : STAR TRINETHRAM

BSNL సూపర్ స్టార్ ప్లాన్‌.. నెలకు 5000 GB డేటా, ఫ్రీ OTT ప్లాట్‌ఫామ్స్

News Image
BSNL Super Star Plan: ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటేడ్ (BSNL) వినియోగదారులను ఆకర్షించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ టెలికాం సంస్థలు వరుసగా రీఛార్జ్ ధరలను పెంచుతున్న వేళ, ఈ ప్రభుత్వ సంస్థ మాత్రం తక్కువ ధరలకు ఎక్కువ సౌకర్యాలు అందిస్తూ మార్కెట్‌లో తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. ఇప్పటికే మొబైల్ సేవల విషయంలో అనేక ఆఫర్లను ప్రకటించిన సంస్థ.. ఇప్పుడు గృహ వైఫై వినియోగదారుల కోసం శుభవార్త అందించింది. ఉన్న ప్లాన్లను అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, అధిక వేగంతో భారీ డేటాను అందించే ప్రీమియం ప్లాన్ ధరను గణనీయంగా తగ్గించింది.

సంస్థ అధికారిక వెబ్ సైట్‌లో విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సూపర్ స్టార్ ప్రీమియం వైఫై ప్లాన్‌ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు నెలకు రూ.999గా ఉన్న ఈ ప్లాన్‌ను రూ.799కు తగ్గించినట్లు వెల్లడించింది. దీంతో వినియోగదారులకు నెలకు రూ.200 వరకు ఆదా కలగనుంది. అంతేకాకుండా 12 నెలల చెల్లింపును ముందుగానే పూర్తిగా చేస్తే అదనంగా 20 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు స్పష్టం చేసింది. ఈ ప్రత్యేక ఆఫర్ 2026 మార్చి 31 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని సంస్థ ప్రకటించింది.

ఈ ప్రీమియం వైఫై ప్లాన్‌లో భాగంగా నెలకు 5000 జీబీ డేటాను 200 ఎంబీపీఎస్ అత్యధిక వేగంతో వినియోగించుకునే అవకాశం ఉంటుంది. భారీ డేటా వినియోగం అవసరమయ్యే కుటుంబాలు, ఆన్‌లైన్ విద్య, ఉద్యోగ అవసరాలు, వినోదం కోసం అధిక వేగ ఇంటర్నెట్ కోరుకునే వారికి ఇది అనుకూలంగా ఉండనుంది. అదనంగా ప్రాచుర్యం పొందిన వినోద వేదికల సౌకర్యాలు (OTT APPS) కూడా ఇందులో భాగంగా అందుబాటులో ఉంటాయని సంస్థ తెలిపింది. తక్కువ ధరలో అధిక సౌకర్యాలు అందించడం ద్వారా వినియోగదారులను తనవైపు తిప్పుకోవాలనే వ్యూహాన్ని స్పష్టంగా అమలు చేస్తోంది.

వైఫై అప్‌గ్రేడ్ ప్రక్రియను కూడా సులభతరం చేసింది. వినియోగదారులు తమ ఫోన్ ద్వారా 1800 4444 నంబర్‌కు సందేశం పంపితే అవసరమైన వివరాలు అందుతాయి. సూచనలను అనుసరించి ప్లాన్‌ను ఎంపిక చేసుకోవచ్చు. 2026 మార్చి 31లోపు ఈ ఆఫర్‌ను వినియోగించుకునే వారికి మాత్రమే రూ.799 ధర వర్తించనుంది. ఆ తర్వాత మళ్లీ రూ.999 చెల్లించాల్సి ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. ముందస్తు చెల్లింపు చేసే వారికి 20 శాతం అదనపు రాయితీ లభించడంతో దీర్ఘకాలికంగా వినియోగించాలనుకునే వారికి ఇది మరింత లాభదాయకంగా మారనుంది.

ప్రభుత్వ సంస్థ నుంచి ఇలాంటి ధరల తగ్గింపు నిర్ణయం రావడం టెలికాం రంగంలో చర్చనీయాంశంగా మారింది. అధిక వేగంతో విస్తృత డేటా, తగ్గిన ధర, అదనపు రాయితీ వంటి అంశాలు వినియోగదారులకు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. మార్కెట్ పోటీలో నిలబడటమే కాకుండా, మరింత మంది వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ నిర్ణయం తోడ్పడనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ALSO READ: Vastu Tips: ఇంట్లో డబ్బు ఉంచే సరైన దిశ ఎక్కడో తెలుసా?
🏠 Home