🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 17 February 2026, 7:57 pm Posted by : STAR TRINETHRAM

బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్‌గా సిలివేరు శ్రీధర్ యాదవ్

News Image
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్దన్నపేట పట్టణంలోని 11వ డివిజన్‌కు చెందిన సిలివేరు శ్రీధర్ యాదవ్‌కు భారత్ రాష్ట్ర సమితి పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బాధ్యతలు అప్పగిస్తూ వర్దన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మంగళవారం అధికారికంగా ప్రకటించారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి మరింత సమర్థంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ నియామకం చేపట్టినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పట్టణ స్థాయిలో పార్టీ బలోపేతానికి యువ నాయకత్వాన్ని ముందుకు తేవాలనే లక్ష్యంతో ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.

ఈ సందర్భంగా తనపై నమ్మకం ఉంచి కీలక బాధ్యతలు అప్పగించిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు సిలివేరు శ్రీధర్ యాదవ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను సోషల్ మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చేర్చేందుకు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలతో సమన్వయం సాధిస్తూ పార్టీ కార్యక్రమాలను మరింత చురుకుగా నిర్వహించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి తాను సంపూర్ణంగా అంకితభావంతో పనిచేస్తానని పేర్కొన్నారు.

తన నియామకానికి సహకరించిన పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్, మాజీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు కోమాండ్ల ఏలెందర్ రెడ్డి, ప్రస్తుత మున్సిపల్ కౌన్సిలర్లు సిలివేరు కుమారస్వామి యాదవ్, గుజ్జ వీరన్న, తిరుపతి సురేష్, చిలువేరు రామరాజశేఖర్, తుమ్మల అరుణ శ్రీధర్, బానోత్ జ్యోతి నవీన్‌లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే మండల అధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి, మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గుజ్జ గోపాల్ రావు, గుజ్జ సంపత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు పూజారి సుజాత రఘు, తోటకూరి రాజమణి, తుమ్మల రవీందర్, మాజీ సహాయ సభ్యుడు ఎం డి అజీమ్, మాజీ వార్డు సభ్యుడు ఆత్మకూరి వెంకటేశ్వర్లు తదితరులకు కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.

ALSO READ: Ganga: మన దేశంలో 5 రాష్ట్రాల నుంచి ప్రవహించే ఒకే ఒక్క నది ఏదంటే?
🏠 Home