🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 16 February 2026, 4:22 pm Posted by : STAR TRINETHRAM

Warangal Politics: వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్‌గా పాలకుర్తి సారంగపాణి

News Image
Warangal Politics: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలపై నెలకొన్న రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. చివరి క్షణం వరకు కొనసాగిన చర్చలు, వ్యూహాలు చివరికి కాంగ్రెస్‌కు అనుకూలంగా మారడంతో చైర్మన్ పదవి ఆ పార్టీ ఖాతాలోకి చేరింది. స్వతంత్రంగా విజయం సాధించిన నేతవత్ శిభారాణి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడం ఈ ఎన్నికలో కీలక మలుపుగా మారి సంఖ్యా సమీకరణాలను మార్చేసింది.

 

కాంగ్రెస్ చేతిలో చైర్మన్ పీఠం..

సంఖ్యాబలం స్పష్టంగా లేకపోయినా స్థానిక స్థాయిలో పార్టీ నేతలు చురుకైన సమన్వయం చేపట్టి స్వతంత్ర సభ్యులతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో అవసరమైన మద్దతును కూడగట్టడంలో విజయవంతమయ్యారు. ఫలితంగా 7 ఓట్ల ఆధిక్యంతో పాలకుర్తి సారంగపాణి వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కే.ఆర్.నాగరాజు ఎక్స్-అఫిషియో ఓటు కూడా నిర్ణాయక పాత్ర పోషించినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

వైస్ చైర్మన్‌గా శిభారాణి ఏకగ్రీవం..

తదుపరి జరిగిన వైస్ చైర్మన్ ఎన్నికలో 5వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన శిభారాణి ఏకగ్రీవ మద్దతుతో వైస్ చైర్మన్‌గా ఎన్నిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. స్వతంత్ర సభ్యురాలిగా విజయం సాధించిన ఆమె కాంగ్రెస్‌లో చేరడం స్థానిక రాజకీయ సమీకరణాల్లో కీలక పరిణామంగా మారింది.



Vice Chairman Netawat Shibarani

ఈ ఫలితంతో జిల్లాలో కాంగ్రెస్ ప్రభావం పెరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. స్థానిక సంస్థల్లో పార్టీ పట్టు బలపడేందుకు ఈ విజయం దోహదం చేస్తుందని పలువురు భావిస్తున్నారు. ఎన్నికల వరకూ కొనసాగిన రాజకీయ వేడి ముగియగా, ఇకపై పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల మెరుగుదల, ప్రజా సమస్యల పరిష్కారంపై కొత్త పాలకవర్గం ఎలా ముందుకు సాగుతుందన్న దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

ALSO READ: Viral photo: విజయ్, రష్మిక పెళ్లి కార్డు ఇదే!
🏠 Home