ఆటోలో ఎక్కిన ప్రభుత్వ టీచర్‌ను పక్కకు తీసుకెళ్లి దారుణానికి పాల్పడ్డ డ్రైవర్
ఆంధ్రప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఓ మహిళా ప్రభుత్వ ఉపాధ్యాయురాలిపై ఆటో డ్రైవర్ కత్తితో దాడి చేయడం కలకలం రేపుతోంది. పాఠశాలకు వెళ్లేందుకు సాధారణంగా ఎక్కిన ప్రయాణమే ఆమెకు ప్రాణాపాయం తీసుకువచ్చింది. నగల కోసం ప్రాణాలకు తెగబడిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది.
వివరాల్లోకి వెళితే.. గూడూరుకు చెందిన హరిత (35) ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె బాలాయపల్లి మండల పరిధిలోని గొట్టిగాడి గ్రామ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. ప్రతిరోజూ గూడూరు నుంచి పాఠశాలకు ప్రయాణిస్తూ విధులు నిర్వర్తించేవారు. అయితే ఈ ఉదయం కూడా ఎప్పటిలాగే స్కూలుకు వెళ్లేందుకు ఆటో ఎక్కారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలపై కన్నేసిన ఆటో డ్రైవర్ ముందుగానే పన్నాగం పన్నినట్లు తెలుస్తోంది.
ప్రయాణమధ్యలో నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్న తర్వాత ఆటోను ఆపిన డ్రైవర్.. హరితపై కత్తితో దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన ఆమెపై నుంచి బంగారు నగలను లాక్కొని అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తస్రావంతో రోడ్డుపై కుప్పకూలిన ఉపాధ్యాయురాలిని చూసి ఆ మార్గంలో వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించారు. ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి వాంగ్మూలం నమోదు చేశారు. నిందిత ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి గాలింపు చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హరితను నెల్లూరుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
ALSO READ: A famous singer: నా గర్భశయాన్ని తీసివేయించాడు