Viral Incident: కాబోయే అల్లుడితో 10 నెలలుగా కాపురం పెట్టిన మహిళ.. ఆపై భారీ ట్విస్ట్
Viral Incident: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కుటుంబ బంధాలను తలకిందులు చేసేలా మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. గత ఏడాది తన కూతురికి కాబోయే అల్లుడితో కలిసి ఇంటిని విడిచి వెళ్లి వివాదానికి కారణమైన అనితా దేవి అలియాస్ అప్నా దేవి, ఇప్పుడు మరోసారి షాకింగ్ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈసారి ఆమె తనతో కలిసి దాదాపు 10 నెలలు నివసించిన రాహుల్‌ను వదిలి, తన మాజీ భర్త జితేంద్ర కుమార్ బావమరిదితో కలిసి పరారైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామం స్థానికంగా తీవ్ర చర్చకు దారి తీసింది.
అసలు ఈ కథ ప్రారంభం అలీఘర్ జిల్లాలోని నాగల మచారియా గ్రామంలో జరిగింది. జితేంద్ర కుమార్ తన కుమార్తె శివాని వివాహాన్ని రాహుల్‌తో నిశ్చయించి, ఏప్రిల్ 16, 2025న పెళ్లి జరగాలని తేదీ ఖరారు చేశారు. వివాహ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆహ్వాన పత్రికలు పంపిణీ అయ్యాయి. అయితే పెళ్లికి కేవలం 9 రోజుల ముందు అనితా దేవి తన కాబోయే అల్లుడు రాహుల్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోవడం సంచలనంగా మారింది. ఇద్దరూ బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లా ఉస్రైనా గ్రామంలో కాపురం పెట్టారు. ఈ ఘటన రెండు రాష్ట్రాల్లోనూ పెద్ద చర్చకు దారి తీసింది.
తర్వాత పోలీసులు జోక్యం చేసుకుని వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అయితే అనితా దేవి స్వచ్ఛందంగా రాహుల్‌తోనే జీవించాలని స్పష్టంగా చెప్పడంతో పోలీసులు వారిని కలిసి ఉండనిచ్చారు. పలు గ్రామ పంచాయితీలు జరిగినా, ఇద్దరూ విడిపోవడానికి నిరాకరించారు. ఈ క్రమంలో దాదాపు 10 నెలల పాటు ఇద్దరూ కలిసి జీవించారు.
అయితే తాజాగా ఈ కథలో మరో మలుపు చోటుచేసుకుంది. బీహార్‌లో నివసిస్తున్న సమయంలో అనితా దేవి తన మాజీ భర్త బావమరిదితో పరిచయం పెంచుకున్నట్లు సమాచారం. అతను అక్కడ బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. తరచూ సంభాషణలు జరగడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి ప్రేమ వ్యవహారంగా మారిందని చెబుతున్నారు. అనంతరం అనితా దేవి రాహుల్‌ను వదిలి ఆ వ్యక్తితో కలిసి వెళ్లిపోయిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, ఇంటి నుంచి రూ.2 లక్షల నగదు, విలువైన నగలు తీసుకెళ్లిందని రాహుల్ ఆరోపించాడు.
ఈ ఘటనపై రాహుల్ అలీఘర్‌లోని దాడోన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ, సంఘటన బీహార్ పరిధిలో జరిగిందని పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేయలేమని స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కేసు పరిధి అంశంపై గందరగోళం నెలకొంది. ఇప్పటికే ఒకసారి సంచలనంగా మారిన ఈ వ్యవహారం, ఇప్పుడు మరోసారి కొత్త మలుపుతో మరింత చర్చనీయాంశమైంది.
ఈ మొత్తం పరిణామంతో తాను మోసపోయానని రాహుల్ వాపోతున్నాడు. వరుస సంఘటనలు కుటుంబ బంధాలు, నమ్మకం, సామాజిక విలువలపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఈ ఘటనపై విస్తృత చర్చ జరుగుతోంది. పోలీసులు తదుపరి చర్యలపై దృష్టి సారించినట్లు సమాచారం.
ALSO READ: Ruksath: రామప్ప కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ వేడుకలు