Ruksath: రామప్ప కళాశాలలో ఘనంగా ఫేర్వెల్ వేడుకలు
* ఆర్మీ జాబ్ సాధించిన 21 మందికి సన్మానం
* గణతంత్ర దినోత్సవ వేడుకల్లో రామప్ప విద్యార్థుల అరుదైన ఘనత
* క్రమశిక్షణతోనే విజయ సాధ్యం: డైరెక్టర్ ఐలి కర్ణాకర్
స్టార్ త్రినేత్రం, హన్మకొండ: హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ వేదికగా బుధవారం (11-02-2026) రామప్ప జూనియర్ కాలేజీ ఆధ్వర్యంలో “రుక్సత్” పేరుతో ఫేర్వెల్ పార్టీ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మొదటి సంవత్సరం విద్యార్థులు, రెండో సంవత్సరం విద్యార్థులకు వీడ్కోలు సభను ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్లు కళాశాల డైరెక్టర్ ఐలి కర్ణాకర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రముఖుల సమక్షంలో ప్రారంభం..
కళాశాల శ్రేయోభిలాషి, మార్గదర్శకురాలు తేజస్వి.. సరస్వతి మాత చిత్రపటానికి పూలమాల వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విశిష్ట అతిథిగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంపిటేటివ్ క్లాసులు బోధిస్తూ విశేష గుర్తింపు పొందిన జీకే మధు హాజరయ్యారు.
ఇటీవల ఆర్మీ ర్యాలీలో కాలేజీ నుండి శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన 21 మంది విద్యార్థులను శాలువాలతో సత్కరించారు. కళాశాల ఫ్యాకల్టీ మెమొంటోలు అందించి వారికి ప్రోత్సాహం ఇచ్చింది.
గణతంత్ర దినోత్సవ ఘనత..
జనవరి 26న ఢిల్లీలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వరంగల్ జిల్లా నుండి ఎంపికైన ఆరుగురిలో ముగ్గురు రామప్ప విద్యార్థులు కావడం విశేషంగా పేర్కొన్నారు. శ్లేష అష్మిత వర్మ, ప్రవీణ్, కొత్తగొండ ప్రమోద్‌లను కాలేజ్ మేనేజ్‌మెంట్ ఘనంగా సత్కరించింది.
క్రమశిక్షణే విజయానికి మార్గం..
డైరెక్టర్ ఐలి కర్ణాకర్ మాట్లాడుతూ.. 70 మంది విద్యార్థులతో ప్రారంభమైన కాలేజ్, నేడు దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులకు ఇంటర్ ప్లస్ డిఫెన్స్, ఇంటర్ ప్లస్ టెక్-బీ, ఇంటర్ ప్లస్ కాంపిటేటివ్, ఇంటర్ ప్లస్ గవర్నమెంట్ జాబ్స్, ఇంటర్ ప్లస్ ఐఐటీ/నీట్ వంటి కోర్సులను అందిస్తూ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర కృషితో లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు సూచించారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
విద్యార్థుల నృత్యాలు, స్కిట్లు, పాటలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకల్లో డైరెక్టర్ ఐలి కర్ణాకర్, జీకే మధు, అర్థమెటిక్ ఫేమ్ రోహిత్, ఐలి తేజస్వి, అకాడమిక్ డీన్ వినోద్, వైస్ ప్రిన్సిపల్ తిరుపతి, ఫిజికల్ డైరెక్టర్ కమల్, జోనల్ మేనేజర్ పూర్ణచందర్, అధ్యాపక బృందం సభ్యులు, నాన్-టీచింగ్ సిబ్బంది, సుమారు 1000 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
ALSO READ: Municipal Elections: రేపు వైన్ షాపులు బంద్