Vida UBEX: ఎలక్ట్రిక్ బైక్ రంగంలో హీరో భారీ అడుగు
Vida UBEX: భారత ఎలక్ట్రిక్ వాహన రంగంలో పోటీ రోజురోజుకీ ఉత్కంఠభరితంగా మారుతున్న వేళ, దేశంలో అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ సంస్థల్లో ఒకటైన హీరో మోటోకార్ప్ తన ఎలక్ట్రిక్ బ్రాండ్ ‘విడా’ ద్వారా మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో తన ఉనికిని బలపరుచుకుంటున్న ఈ సంస్థ.. ఇప్పుడు ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల మార్కెట్‌పై దృష్టి సారించడం విశేషం. ఈ క్రమంలో విడా ఉబెక్స్ (Vida UBEX) పేరుతో రూపొందించిన సరికొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు భారత్‌లో డిజైన్ పేటెంట్ లభించడం రంగంలో చర్చనీయాంశమైంది. ఈ పరిణామం 2026 నాటికి ఎలక్ట్రిక్ బైక్ సెగ్మెంట్‌లో గణనీయమైన మార్పులకు దారితీయవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అంతర్జాతీయ వేదికపై ఇప్పటికే తన శక్తిని చాటుకున్న ఈ మోడల్‌ను గత ఏడాది ఇటలీలో జరిగిన ప్రతిష్టాత్మక EICMA ఆటో షోలో కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించగా, స్ట్రీట్ ఫైటర్ శైలిలో రూపుదిద్దుకున్న డిజైన్‌కు విశేష స్పందన లభించింది. ఇప్పుడు అదే డిజైన్‌కు దేశీయంగా పేటెంట్ లభించడం ద్వారా ఉత్పత్తి దశకు సంస్థ వేగంగా అడుగులు వేస్తోందనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఎలక్ట్రిక్ బైక్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ ఆధిపత్యానికి సవాల్ విసరాలనే లక్ష్యంతో హీరో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
విడా ఉబెక్స్ డిజైన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో సింగిల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌తో పాటు ఆకర్షణీయమైన ఎల్‌ఈడి డే టైమ్ రన్నింగ్ లైట్స్ బైక్‌కు అగ్రెసివ్ లుక్‌ను ఇస్తున్నాయి. మస్క్యులర్ ట్యాంక్ ప్యానెల్స్, స్ప్లిట్ సీట్ సెటప్, శారీరక భంగిమకు అనుగుణంగా రూపుదిద్దుకున్న ఎర్గోనామిక్స్ రైడర్‌కు స్పోర్టీ అనుభూతిని కలిగించేలా రూపొందించబడ్డాయి. కాన్సెప్ట్ మోడల్‌లో చూపించిన ఖరీదైన యూఎస్‌డీ ఫోర్క్స్ స్థానంలో ఉత్పత్తి మోడల్‌లో సాధారణ టెలిస్కోపిక్ ఫోర్క్స్ వాడే అవకాశం ఉందని సమాచారం. దీనివల్ల ధరను నియంత్రిస్తూ సామాన్య వినియోగదారులకు చేరువ కావాలన్నది కంపెనీ వ్యూహంగా భావిస్తున్నారు.
పెర్ఫార్మెన్స్ పరంగా కూడా ఈ బైక్ గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. పేటెంట్ చిత్రాల్లో కనిపిస్తున్న భారీ బ్యాటరీ ప్యాక్ బైక్ కింది భాగం వరకు విస్తరించి ఉండటం గమనార్హం. దీని ఆధారంగా ఒక్కసారి పూర్తి ఛార్జ్ చేస్తే సుమారు 150 నుంచి 200 కిలోమీటర్ల మధ్య ప్రయాణ దూరం అందించే సామర్థ్యం ఉండొచ్చని ఆటోమొబైల్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. నగర ప్రయాణాలకు మాత్రమే కాకుండా దీర్ఘదూర రైడ్స్‌కూ అనువుగా ఉండేలా బ్యాటరీ సామర్థ్యాన్ని రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. ఆధునిక డిజిటల్ కన్సోల్, కనెక్టెడ్ ఫీచర్లు, రైడింగ్ మోడ్‌లు వంటి సాంకేతిక సౌకర్యాలు కూడా ఇందులో ఉండే అవకాశముందని మార్కెట్ అంచనాలు సూచిస్తున్నాయి.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, స్కూటర్లతో పాటు మోటార్‌సైకిళ్ల విభాగంలో కూడా భారీ డిమాండ్ ఏర్పడుతోంది. ఈ తరుణంలో హీరో విడా ఉబెక్స్ ప్రవేశం కేవలం కొత్త మోడల్ ఆవిష్కరణ మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ బైక్ మార్కెట్‌ను మరింత విస్తరించే దిశగా కీలక మలుపుగా నిలవొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ధర, రేంజ్, డిజైన్, టెక్నాలజీ అంశాల్లో సమతుల్యత సాధించగలిగితే, ఇది యువతను ఆకర్షించే ప్రధాన మోడల్‌గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: Exit polls: ‘మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌దే హవా..!’