🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 08 February 2026, 4:35 pm Posted by : STAR TRINETHRAM

‘పవన్ సార్. నన్ను చంపేయండి’.. ఎమ్మెల్యే బాధితురాలి మరో వీడియో

News Image
జనసేన విప్‌, రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో బాధితురాలు హర్షవీణ మరో వీడియోను విడుదల చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే పదవి, విప్ హోదా లేకుండా శ్రీధర్ ఒక సాధారణ వ్యక్తి అయి ఉంటే తనకు చేసిన ద్రోహానికి ఈ పాటికే అరెస్టై జైలులో ఉండేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నాడనే కారణంతోనే అతడు ధైర్యంగా బయట తిరుగుతున్నాడని ఆరోపించారు.

https://twitter.com/RTVnewsnetwork/status/2020421585451311608?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2020421585451311608%7Ctwgr%5E1c9d49474a4d3560d5813767c32ee6dcf503b00e%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fpublish.twitter.com%2F%3Furl%3Dhttps%3A%2F%2Ftwitter.com%2FRTVnewsnetwork%2Fstatus%2F2020421585451311608

ఈ ఘటనను బట్టి చూస్తే ఈ విషయంపై అందరూ రాజకీయాలు చేస్తున్నట్లు కనిపిస్తోందని హర్షవీణ వ్యాఖ్యానించారు. అయితే అధికారాన్ని ఉపయోగించుకుని జరిగిన అంశాన్ని రాజకీయంగా మలుస్తోంది మాత్రం శ్రీధర్‌నేనని, తాను ఎలాంటి పాలిటిక్స్ చేయట్లేదని స్పష్టం చేశారు. తనకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలన్నదే తన ఏకైక లక్ష్యమని తెలిపారు.

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రత్యక్షంగా కలిసి జరిగిన విషయాన్ని వివరించాలని, తనకు ఆయనే న్యాయం చేయాలని వీడియోలో ఆమె వేడుకున్నారు. పవన్ కల్యాణ్‌ను కలిసేందుకు అనుమతి ఇవ్వాలని కోరిన హర్షవీణ.. ఒక్కసారి మాట్లాడే అవకాశం ఇస్తే అసలు నిజం ఏంటో పూర్తిగా వివరిస్తానని తెలిపారు. ఇతరుల నుంచి వస్తున్న మాటలు తనకు పట్టలేదని, నిజం బయటపడటమే ముఖ్యమని ఆమె పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, ఈ కేసుకు సంబంధించి ఇటీవలే అరవ శ్రీధర్ జనసేన త్రిసభ్య కమిటీ ఎదుట హాజరయ్యారు. తన వద్ద ఉన్న ఆధారాలను కమిటీకి అందించానని, పార్టీ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. ఈ వ్యవహారాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేరుతో ముడిపెట్టి మాట్లాడవద్దని కూడా ఆయన కోరారు. ఈ పరిణామాలతో ఈ కేసు రాజకీయంగా మరింత సున్నితంగా మారింది. బాధితురాలి తాజా వీడియో, శ్రీధర్ వ్యాఖ్యలతో ఈ వ్యవహారం ఎటు దారితీస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

ALSO READ: Valentine’s Day: భారీగా హోటల్ రూమ్ బుకింగ్స్
🏠 Home