🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 February 2026, 8:07 pm Posted by : STAR TRINETHRAM

అక్రిడిటేషన్ కార్డుల జారీకి ఆన్‌లైన్ దరఖాస్తుల ఆహ్వానం

News Image
ఈ నెల 9 నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించాలి

: జిల్లా కలెక్టర్ సత్య శారద

స్టార్ త్రినేత్రం, వరంగల్: సమాచార పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో 2026-28 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల జారీ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ సత్య శారద శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం అమల్లో ఉన్న అక్రిడిటేషన్ కార్డుల కాలపరిమితి గడువు ఫిబ్రవరి 28తో ముగియనున్నందున అర్హత కలిగిన జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కార్డుల కోసం మీడియా యాజమాన్యాలు తమ జర్నలిస్టుల పేర్ల జాబితాను (ఓరిజినల్) జిల్లా పౌరసంబంధాల అధికారినకు సమర్పించాలన్నారు. యాజమాన్యాల ద్వారా పంపిన పేర్లలో ఉన్న జర్నలిస్టులు మాత్రమే సమాచార పౌరసంబంధాల శాఖ అధికారిక వెబ్‌‌సైట్
http://ipr.telangana.gov.in ద్వారా ఆన్‌ లైన్‌ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లా స్థాయిలో ఆన్‌ లైన్ దరఖాస్తులను ఫిబ్రవరి 9 నుండి సమర్పించాలని, అర్హులైన జర్నలిస్టులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.

ALSO READ: వేసవిలో తాగునీటి ఎద్దడి నివారణకు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలి
🏠 Home