🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 07 February 2026, 10:14 am Posted by : STAR TRINETHRAM

అందుబాటులో ఉంటా.. అభివృద్ధిని చూపిస్తా: ఈగ దామోదర్

News Image
- ప్రతిపక్షాలు బేజారు.. దూసుకుపోతున్న ఈగ దామోదర్
- మీ బిడ్డగా మీ ముందుకు వస్తున్నాను
- నన్ను ఆశీర్వదించండి..కౌన్సిలర్‌గా గెలిపించండి..
- ప్రచారంలో అడుగడుగునా ఈగ దామోదర్‌కి అపూర్వ స్పందన
- గెలుపు ఖాయం అంటున్న ప్రజలు

స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా కొనసాగుతుండగా, ప్రతిపక్షాలను పూర్తిగా వెనక్కి నెట్టేస్తూ హస్తం పార్టీ స్పష్టమైన ఆధిక్యతతో ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఇంటింటి ప్రచారానికి పెద్దపీట వేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి ఈగ దామోదర్ ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వార్డు అభివృద్ధిపై తన ఆలోచనలను స్పష్టంగా వివరిస్తున్నారు. గడపగడపకు వెళ్లి ఓటర్లను కలుస్తున్న ఆయన.. ఈ నెల 11న జరిగే పోలింగ్‌లో చేతి గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలని అభ్యర్థిస్తున్నారు.



“మీ బిడ్డగా మీ ముందుకు వచ్చాను” అంటూ వినమ్రతతో మాట్లాడుతున్న ఈగ దామోదర్, కేవలం హామీలకే పరిమితం కాకుండా అభివృద్ధి చేసి చూపిస్తానని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. కౌన్సిలర్‌గా గెలిస్తే మాటలకన్నా పనితోనే తన సామర్థ్యాన్ని నిరూపిస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే నాగరాజు అండతో 11వ వార్డును అభివృద్ధి పథంలో ముందుకు నడిపి, మున్సిపాలిటీలోనే ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు.



అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఎన్నికల వేళ మాత్రమే కనిపించి ఆ తర్వాత కనుమరుగయ్యే ప్రతిపక్ష నాయకుల మాటలకు ప్రజలు మోసపోవద్దని ఆయన సూచించారు. తాను గెలిస్తే ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటూ, చిన్నా పెద్దా సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. వార్డు ప్రజల అవసరాలు, సమస్యలు తనకు తెలుసునని, వాటి పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ప్రచారంలో ఆయన స్పష్టం చేశారు.

ఈగ దామోదర్ నిర్వహిస్తున్న ప్రచారానికి అడుగడుగునా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ప్రచారంలో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి, “నిన్నే గెలిపిస్తాం” అంటూ ధీమా వ్యక్తం చేయడం కనిపిస్తోంది. దీంతో వార్డులో ఎన్నికల వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని, ఈసారి 11వ వార్డులో హస్తం పార్టీ విజయం ఖాయమన్న విశ్వాసం కార్యకర్తల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

ALSO READ: ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి: కలెక్టర్ సత్య శారద
🏠 Home