ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలి: కలెక్టర్ సత్య శారద
స్టార్ త్రినేత్రం, వర్ధన్నపేట: మున్సిపల్ ఎన్నికల విధులను పీఓ, ఏపీఓలు సమర్థవంతంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి సత్య శారద అన్నారు. శుక్రవారం వర్ధన్నపేట రైతు వేదికలో మున్సిపల్ ఎన్నికల పీఓ, ఏపీఓలకు ఏర్పాటు చేసిన ఎన్నికల శిక్షణ కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పారదర్శకంగా, స్వేచ్ఛాయుతంగా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించేందుకు ప్రిసైడింగ్ అధికారుల పాత్ర చాలా కీలకమైనదన్నారు.
ఎన్నికలకు సంబంధించి డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో ఇచ్చే మెటీరియల్, బ్యాలెట్ బాక్స్‌ల సీలింగ్ ప్రిసైడింగ్ అధికారుల డైరీ, బ్యాలెట్ పేపర్ అకౌంట్ ఏజెంట్ల సమక్షంలోనే బ్యాలెట్ బాక్సులను తెరవడం, తర్వాత ఉదయం 7 గంటలకు పోలింగ్ స్టార్ట్ చేయడం తదితర అంశాలపై కలెక్టర్ పీఓ, ఏపీఓలకు వివరించారు.
పోలింగ్ సామాగ్రి స్వీకరణ నుండి పోలింగ్ ముగిసే వరకు ప్రతి విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటర్లకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడంతోపాటు అన్ని సదుపాయాలు కల్పించాలన్నారు. ఎన్నికల నియమ నిబంధనలను పాటిస్తూ ఎన్నికల ప్రక్రియ మొత్తం నిష్పక్షపాతంగా జరగాలని తెలిపారు.
ప్రతి రెండు గంటలకు ఒకసారి పోలింగ్ శాతం టీ పోల్‌లో అప్‌లోడ్ చేయాలని, పోలింగ్ కేంద్రంలోకి వాటర్ బాటిళ్లు, బ్యాగ్, మొబైల్, ఇంక్ ప్యాడ్ వంటివి అనుమతించవద్దని అన్నారు. 100 మీటర్ల అవతల వెహికల్స్ పార్కింగ్ చేసుకోవాలని, పోలింగ్ కేంద్రం వద్ద మెడికల్ టీమ్స్, వీల్ చైర్, అంగన్‌వాడీల సహాయకులు ఉంటారని తెలిపారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు. కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ నిర్వహణ కలెక్టర్ పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా ఎన్నికల నిర్వహణకు వినియోగించే బ్యాలెట్ బాక్సులు, సీల్స్, బ్యాలెట్ పేపర్లు తదితర ఎన్నికల సామగ్రిని కూడా కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రత, సరైన నిల్వ, రవాణా ప్రక్రియలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆదనవు కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీఓ సుమా, తహసీల్దార్ విజయ్, మున్సిపల్ కమిషనర్ సుదీర్ కుమార్, మాస్టర్ ట్రైనర్లు శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
ALSO READ: Black Phone 2: OTTలో గత్తరలేపుతున్న హార్రర్.. చూడటం స్టార్ట్ చేస్తే క్షణం కూడా వదలరు