Black Phone 2: OTTలో గత్తరలేపుతున్న హార్రర్.. చూడటం స్టార్ట్ చేస్తే క్షణం కూడా వదలరు
Black Phone 2: ప్రస్తుతం ఓటీటీ ప్రపంచం రోజురోజుకు మరింత ఉత్కంఠభరితంగా మారుతోంది. థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ వేదికలపై విడుదలయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలకు ఓటీటీలో ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. ఇందులో హారర్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్‌కు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఉండటం గమనార్హం. భయంకరమైన కథనాలు, ఊపిరి ఆపేసే సన్నివేశాలతో రూపొందిన సిరీస్‌లు, సినిమాలు ప్రేక్షకులను స్క్రీన్కు అతుక్కుపోయేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ భయానక హారర్ థ్రిల్లర్ చిత్రం ఓటీటీలో సందడి చేస్తూ గత్తర లేపుతోంది.
ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ప్రభావం పెరిగిన తర్వాత హారర్ కంటెంట్‌కు గిరాకీ మరింత పెరిగింది. థియేటర్లో చూసే ధైర్యం లేని ప్రేక్షకులు కూడా ఇంట్లో కూర్చొని భయాన్ని ఆస్వాదించడానికి ఆసక్తి చూపుతున్నారు. సస్పెన్స్, మిస్టరీ, అతీంద్రియ శక్తులు కలిసిన కథలంటే యువత నుంచి పెద్దల వరకూ ప్రత్యేకమైన క్రేజ్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ నుంచి వచ్చిన ఓ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా అమెరికన్ సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ “బ్లాక్ ఫోన్ 2” (Black Phone 2). 2021లో విడుదలై భారీ విజయం సాధించిన “ది బ్లాక్ ఫోన్” సినిమాకు ఇది సీక్వెల్‌గా రూపొందింది. దర్శకుడు స్కాట్ డెరిక్సన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, ప్రముఖ నిర్మాణ సంస్థ బ్లమ్‌హౌస్ ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించింది. మొదటి భాగంతో పోలిస్తే ఈ సీక్వెల్లో హారర్ ఎలిమెంట్స్‌ను మరింత పెంచి, కథను ఇంకాస్త లోతుగా తీసుకెళ్లారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
థియేటర్లలో 2025 అక్టోబర్ 1న విడుదలైన “బ్లాక్ ఫోన్ 2” బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాపై ఓటీటీ విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే 2026 జనవరి 16 నుంచి ఈ సినిమా Peacock, Prime Video వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఓటీటీలోకి వచ్చినప్పటి నుంచి హారర్ ప్రేమికులు ఈ సినిమాను విపరీతంగా చూస్తున్నారు.
ఈ చిత్రంలో మాసన్ థేమ్స్, మడేలిన్ మెక్‌గ్రా, జెరెమీ డేవిస్, ఈతాన్ హాక్ వంటి నటులు కీలక పాత్రల్లో నటించారు. ముఖ్యంగా ఈతాన్ హాక్ నటన మరోసారి ప్రేక్షకులను భయపెట్టేలా ఉందని కామెంట్స్ వినిపిస్తున్నాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, కెమెరా వర్క్ కలిసి సినిమాకు మరింత ప్రాణం పోశాయి.
కథ విషయానికి వస్తే.. మొదటి భాగంలో జరిగిన భయానక సంఘటనల తర్వాత 4 సంవత్సరాల తర్వాత కథ కొనసాగుతుంది. ఫిన్నీ, అతని సోదరి గ్వెన్ గతంలో ఎదుర్కొన్న భయంకర అనుభవాలను మర్చిపోయి సాధారణ జీవితానికి అలవాటు పడేందుకు ప్రయత్నిస్తుంటారు. అయితే గ్వెన్‌కు తరచూ విచిత్రమైన కలలు రావడం ప్రారంభమవుతుంది. ఆ కలలు క్రమంగా మరింత భయంకరంగా మారుతుంటాయి.
ఈ క్రమంలో వింటర్ యూత్ క్యాంప్‌కు వెళ్లినప్పుడు అక్కడ పిల్లలు ఒక్కొక్కరిగా కనిపించకుండా పోవడం మొదలవుతుంది. ఈ ఘటనలన్నింటికీ గతంలో చనిపోయిన గ్రాబర్ అనే భయానక వ్యక్తి అతీంద్రియ శక్తిగా తిరిగి వచ్చాడేమో అన్న అనుమానం బలపడుతుంది. ఈ పరిస్థితుల్లో ఫిన్నీ, గ్వెన్ కలిసి ఆ అశరీర శక్తిని ఎలా ఎదుర్కొన్నారు, వారికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి, చివరకు నిజం ఏంటన్నదే ఈ సినిమా కథాంశం.
సినిమా మొత్తం ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఒక్కో సీన్ ప్రేక్షకుల్లో ఒళ్లుగగుర్పొడిచేలా ఉండటంతో చివరి వరకు ఆసక్తి తగ్గకుండా కథ నడుస్తుంది. హారర్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషనల్ టచ్, థ్రిల్లింగ్ మోమెంట్స్ కలిసి సినిమా అనుభూతిని మరింత పెంచాయి. మొత్తంగా హారర్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి “బ్లాక్ ఫోన్ 2” ఓటీటీలో మిస్ కాకూడని బెస్ట్ ఛాయిస్‌గా చెప్పవచ్చు.
ALSO READ: మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని హీటెక్కిస్తున్న గులాబీ నేతలు