Telangana: కొత్త అక్రిడిటేషన్ దరఖాస్తులకు ఆహ్వానం
స్టార్ త్రినేత్రం, డెస్క్: తెలంగాణలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలు, వర్కింగ్ జర్నలిస్టులకు సంబంధించిన కీలక ప్రకటనను రాష్ట్ర సమాచార-పౌర సంబంధాల శాఖ చేసింది. జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు ప్రత్యేక కమిషనర్ ప్రియాంక ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తాజాగా అమల్లోకి తీసుకొచ్చిన తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ రూల్స్-2025 ప్రకారం కొత్త విధానాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. జర్నలిస్టుల గుర్తింపు ప్రక్రియలో స్పష్టత, పారదర్శకత తీసుకురావాలనే లక్ష్యంతో ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే 2025 డిసెంబర్ 22న జారీ చేసిన జీఓ ఎంఎస్ నం.252తో పాటు, 2026 జనవరి 24న విడుదలైన సవరణ ఉత్తర్వుల ఆధారంగా ఈ అక్రిడిటేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ఈ నిబంధనల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు అక్రిడిటేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. ఫిబ్రవరి 9, 2026 నుంచి ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆఫ్‌లైన్ దరఖాస్తులకు అవకాశం ఉండదని, పూర్తిగా డిజిటల్ విధానంలోనే ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు తెలిపారు.
అక్రిడిటేషన్ కార్డుల కోసం జర్నలిస్టులు తప్పనిసరిగా సమాచార- పౌర సంబంధాల శాఖ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా మీడియా అక్రిడిటేషన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆయా కమిటీల ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, అర్హతలు పూర్తిగా ఉన్న జర్నలిస్టులకు మాత్రమే మార్గదర్శకాల ప్రకారం అక్రిడిటేషన్ కార్డులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
కొత్త విధానం అమలులోకి రావడంతో అక్రిడిటేషన్ ప్రక్రియ మరింత వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుందని సమాచార శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఎదురైన ఆలస్యాలు, అయోమయాలకు ఇకపై అవకాశం ఉండదని, అన్ని దరఖాస్తులు ఆన్‌లైన్ ట్రాకింగ్ ద్వారా పర్యవేక్షించవచ్చని తెలిపారు. జర్నలిస్టుల హక్కులు, గుర్తింపును బలోపేతం చేయడమే ఈ విధానం ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.
ALSO READ: Viral Video: నడిరోడ్డుపై టీచర్ పెదాలు కొరికి.. ఆపై!