Lucky draw: అదృష్టం అంటే ఇదే.. లాటరీలో రూ.49 కోట్లు జాక్‌పాట్ కొట్టాడు
Lucky draw: అబుదాబి వేదికగా నిర్వహించే ప్రతిష్టాత్మక బిగ్‌టికెట్ లాటరీలో భారతీయుడికి అదృష్టం వరించింది. కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లాకు చెందిన 33 ఏళ్ల శాంతను శెట్టిగార్ లక్కీడ్రాలో ఏకంగా 20 మిలియన్ల దిర్హామ్‌లు గెలుచుకుని అందరి దృష్టిని ఆకర్షించాడు. భారతీయ కరెన్సీలో ఈ మొత్తం విలువ సుమారు రూ.49 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా కోట్లాది రూపాయల బంపర్ ఆఫర్ తగలడంతో శాంతను జీవితం పూర్తిగా మారిపోయింది.
బిగ్‌టికెట్ లాటరీ ఫలితాలు వెలువడిన వెంటనే ఈ వార్త వేగంగా వ్యాపించింది. అబుదాబిలో లాటరీ డ్రా జరుగుతుండగా శాంతను పేరు విజేతగా ప్రకటించగానే అతడికి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కొన్నేళ్లుగా విదేశాల్లో పనిచేస్తూ కుటుంబ భవిష్యత్తు కోసం కలలు కంటున్న శాంతనుకు ఈ లక్కీడ్రా ఊహించని వరంగా మారింది. సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన అతడు ఇప్పుడు కోట్లకు పడగలెత్తడం స్థానికంగా పెద్ద చర్చగా మారింది.
ఈ విషయం తెలియగానే కర్ణాటకలోని ఉడిపి జిల్లా, అతని స్వగ్రామంలో సంబరాలు మొదలయ్యాయి. బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు ఒకచోట చేరి ఆనందం పంచుకున్నారు. మిఠాయిలు పంచుతూ, శాంతనుకు శుభాకాంక్షలు తెలియజేశారు. తమ గ్రామం పేరు అంతర్జాతీయ స్థాయిలో వినిపించడంతో గ్రామస్తుల్లో గర్వభావం వ్యక్తమవుతోంది. ఒక సాధారణ యువకుడికి ఇంతటి అదృష్టం దక్కడం అందరికీ ప్రేరణగా మారిందని పలువురు అంటున్నారు.
అబుదాబి బిగ్‌టికెట్ లాటరీలో భారతీయులు తరచూ భారీ బహుమతులు గెలుచుకుంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న భారతీయులు ఈ లాటరీలపై ఆసక్తి చూపిస్తుంటారు. శాంతను శెట్టిగార్ విజయం కూడా అలాంటి కోట్లాది మంది కలలకు ప్రతీకగా నిలుస్తోంది. ఒక్క టికెట్‌తో జీవితం మారిపోతుందనడానికి ఇది మరో ఉదాహరణగా నిలిచింది.
ALSO READ: IND vs AFG U19: వరల్డ్ కప్ ఫైనల్‌కు భారత్