Suicide: అయ్యో తల్లి.. అమ్మ కోసం ఆలోచించి ఎంత పని చేశావమ్మ!
Suicide: తన పెండ్లి తర్వాత తల్లిని చూసుకునే వారు ఉండరనే ఆందోళనతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చదువుతో, మంచి ఉద్యోగంతో జీవితం ముందుకు సాగాల్సిన వయసులోనే మానసిక భారాన్ని మోయలేక సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. ఆదివారం హుస్సేన్ సాగర్‌లో దూకి ప్రాణాలు తీసుకున్న యువతిని పోలీసులు సోమవారం గుర్తించి, ఘటనకు సంబంధించిన వివరాలను వెలుగులోకి తెచ్చారు.
లేక్ ఇన్‌స్పెక్టర్ ఆర్.వెంకటేశ్వర్లు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆదిలాబాద్ జిల్లా బైంసాకు చెందిన విజయలక్ష్మి (26) తన తండ్రి మరణం తర్వాత తల్లితో కలిసి కూకట్‌పల్లిలోని మోతి నగర్‌లో అద్దెకు నివసిస్తోంది. ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెలకు సుమారు లక్ష రూపాయల జీతం పొందుతోంది. ఆర్థికంగా నిలదొక్కుకున్నప్పటికీ, కుటుంబ బాధ్యతల విషయంలో ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనైనట్లు పోలీసులు గుర్తించారు.
విజయలక్ష్మి తల్లి పూర్తిగా అనారోగ్యంతో ఉండటంతో ఆమె బాగోగులు చూసుకోవడం మొత్తం విజయలక్ష్మి భుజాలపైనే ఉంది. తండ్రి లేని లోటు, తల్లికి తానే అండగా ఉండాల్సిన పరిస్థితి ఆమెను లోపల నుంచే కలచివేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇదే సమయంలో కజిన్ బ్రదర్స్ సహకారంతో విజయలక్ష్మికి పెండ్లి సంబంధాలు కూడా చూస్తుండటంతో ఆమె మానసికంగా మరింత కలతకు గురైనట్లు తెలుస్తోంది.
“నేను పెండ్లి చేసుకుని వెళ్లిపోతే తల్లిని చూసుకునే వారు ఎవరు ఉంటారు?” అనే ఆలోచన విజయలక్ష్మిని తరచూ వేధించేదని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఆ ఆందోళన నుంచి బయటపడలేక ఏం చేయాలో తెలియని స్థితిలో ఆమె తీవ్ర మానసిక సంఘర్షణకు లోనైనట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే తన ల్యాప్‌టాప్‌లో ఆత్మహత్యకు సంబంధించిన విషయాల కోసం సెర్చ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.
జనవరి 31న మధ్యాహ్నం సమయంలో రాపిడో టూ వీలర్ బుక్ చేసుకున్న విజయలక్ష్మి ట్యాంక్ బండ్‌కు చేరుకుంది. అనంతరం అన్నమయ్య విగ్రహం వద్ద హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. ఆమె తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కజిన్ బ్రదర్స్ కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని గుర్తించారు.
దర్యాప్తు సందర్భంగా విజయలక్ష్మి ల్యాప్‌టాప్‌ను పరిశీలించగా, ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు స్పష్టమైన ఆధారాలు లభించినట్లు లేక్ పోలీసులు తెలిపారు. తల్లి అనారోగ్యం, పెండ్లి విషయంపై కలిగిన ఆందోళన, ఒంటరితనం వంటి కారణాలే ఈ విషాదానికి దారి తీసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
ALSO READ: Atrocious: అమ్మాయిని తొక్కిపడేసిన ఎద్దు (VIDEO)