Wardhannapet: మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మానిఫెస్టో విడుదల
Wardhannapet: వర్ధన్నపేటలో జరగనున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సోమవారం బీజేపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యేలు వన్నాల శ్రీరాములు, రాజేశ్వరరావు, కొండేటి శ్రీధర్‌తో పాటు బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంటా రవిలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాబోయే రోజుల్లో వర్ధన్నపేట మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వర్ధన్నపేటలో కాషాయ జెండాను ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ విజయాన్ని సాధించడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన నేతలు.. ప్రతి కార్యకర్త పూర్తి స్థాయిలో నిబద్ధతతో పనిచేయాలని సూచించారు. కార్యకర్తలంతా ఒక సైనికుడిలా, ఒక వీరుడిలా పనిచేస్తూ ప్రతి వార్డు, ప్రతి వీధి, ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని అన్నారు. గడపగడపకు వెళ్లి కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలకు అందుతున్న లబ్ధిని ఓటర్లకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు.
అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన వైఫల్యాలు, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జరిగిన నిర్లక్ష్యాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలని బీజేపీ నేతలు పేర్కొన్నారు. ప్రజలను మభ్యపెట్టే రాజకీయాలకు స్వస్తి పలికి, నిజాలను స్పష్టంగా వివరించాల్సిన అవసరం ఉందని అన్నారు. వర్ధన్నపేట ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఆ అభివృద్ధిని అందించగల పార్టీ ఒక్కటే బీజేపీ అని వారు స్పష్టం చేశారు.
ఈ మీడియా సమావేశంలో బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బన్న ప్రభాకర్‌తో పాటు కన్వీనర్లు, కో-కన్వీనర్లు ముత్తిరెడ్డి కేశవరెడ్డి, తిరుపతి రెడ్డి, మండల అధ్యక్షులు కొండేటి అనితా సత్యం పాల్గొన్నారు. అలాగే వర్ధన్నపేట ఎన్నికల ప్రభారీ గుజ్జుల సత్యనారాయణ, ఎన్నికల కన్వీనర్ మైస రాము, మున్సిపల్ ఎన్నికల జిల్లా ప్రభారీ రాయపురం కుమారస్వామి, మాజీ వైస్ జడ్పీ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, మొండేటి మహేందర్ రెడ్డి, గడ్డం మహేందర్, పొన్నగోటి వెంకట్రావు, కుచన క్రాంతి కుమార్‌తో పాటు వార్డు కౌన్సిలర్ అభ్యర్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు. వర్ధన్నపేటలో ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నట్లు ఈ సమావేశం ద్వారా బీజేపీ నేతలు పేర్కొన్నారు.
ALSO READ: Vastu Tips: అవునా.. నిజమా.. బట్టలు ఉతకడానికి కూడా నియమాలుంటాయా?