Vastu Tips: అవునా.. నిజమా.. బట్టలు ఉతకడానికి కూడా నియమాలుంటాయా?
Vastu Tips: వారంలో బట్టలు ఉతకడం అనేది చాలా సాధారణమైన ఇంటి పనిలా కనిపించినప్పటికీ వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నమ్మకాల ప్రకారం దీనికీ కొన్ని నియమాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మనం రోజూ చేసే చిన్న చిన్న పనులు కూడా ఇంట్లో శక్తి ప్రవాహంపై ప్రభావం చూపుతాయని వాస్తు పండితులు వివరిస్తారు. ముఖ్యంగా నీటితో, సబ్బులతో చేసే పనులు సానుకూల శక్తిని పెంచవచ్చో లేదా ప్రతికూల ప్రభావాలను తీసుకురావచ్చో అవుతాయని అంటున్నారు. బట్టలు ఉతకడాన్ని ఏ రోజైనా, ఎలా పడితే అలా చేయడం వల్ల ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, కుటుంబ కలహాలు వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం.. ప్రతి రోజు ఒక ప్రత్యేక గ్రహానికి, దైవత్వానికి సంబంధించినదిగా భావిస్తారు. అందుకే ఆ రోజు చేసే పనులు ఆయా గ్రహాల ప్రభావాన్ని పెంచేలా లేదా తగ్గించేలా పనిచేస్తాయని నమ్మకం ఉంది. బట్టలు ఉతకడం అనేది నీరు మురికి తొలగింపు డిటర్జెంట్ల వినియోగంతో ముడిపడి ఉండే పని కావడంతో కొన్ని రోజుల్లో ఈ పని చేయకపోవడమే మంచిదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గురువారం, మంగళవారం, శనివారం వంటి రోజుల్లో బట్టలు ఉతకడం మంచిది కాదని చెబుతున్నారు.
గురువారం.. బృహస్పతి గ్రహానికి సంబంధించిన రోజు. బృహస్పతి సంపద, జ్ఞానం, కుటుంబ శ్రేయస్సు, పిల్లల భవిష్యత్తుకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున సబ్బులు, డిటర్జెంట్లు ఉపయోగించి బట్టలు ఉతకడం వల్ల బృహస్పతి ప్రభావం బలహీనపడుతుందని జ్యోతిష్య నమ్మకం. దీని వల్ల ఆర్థిక సమస్యలు ఉద్యోగంలో స్థిరత్వం లేకపోవడం అభివృద్ధిలో ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయని విశ్వసిస్తారు. అందుకే గురువారం రోజున వీలైనంత వరకు బట్టలు ఉతకకుండా ఉండాలని వాస్తు శాస్త్రం సూచిస్తోంది.
మంగళవారం.. మంగళ గ్రహానికి అగ్ని తత్వానికి సంబంధించిన రోజు. ఈ రోజున బట్టలు ఉతకడం వల్ల ఇంట్లో అనవసర గొడవలు, కోపతాపాలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. కుటుంబ సభ్యుల మధ్య మాట పట్టింపులు, మానసిక ఒత్తిడి అధికమయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అంతేకాదు కొందరి నమ్మకం ప్రకారం మంగళవారం బట్టలు ఉతకడం వల్ల ఇంట్లోని వారి ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంటుందని చెబుతారు.
శనివారం.. శనిదేవునికి అంకితమైన రోజు. శని కర్మ, శ్రమ ఆలస్యాలకు సంకేతంగా భావిస్తారు. ఈ రోజున నూనెకు సంబంధించిన పనులు పాత వస్తువుల శుభ్రపరిచే పనులు, బట్టలు ఉతకడం వంటి పనులను తగ్గించాలని వాస్తు శాస్త్రం సూచిస్తుంది. శనివారం నీటిని వృథా చేయడం లేదా ఎక్కువగా శుభ్రపరిచే పనులు చేయడం వల్ల శని దోషం పెరిగి జీవితంలో ఆటంకాలు, ఆలస్యాలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయని నమ్ముతారు.
రోజుతో పాటు సమయానికీ వాస్తు శాస్త్రంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. సూర్యాస్తమయం తర్వాత బట్టలు ఉతకడం లేదా ఆరబెట్టడం మంచిది కాదని వాస్తు జ్యోతిష్య నమ్మకాలు చెబుతున్నాయి. రాత్రి సమయంలో ప్రతికూల శక్తి ఎక్కువగా ఉంటుందని ఆ శక్తి బట్టల ద్వారా మన శరీరంపై ప్రభావం చూపుతుందని విశ్వసిస్తారు. శాస్త్రీయంగా చూసినా సూర్యకాంతి లేకపోవడం వల్ల బట్టలపై బ్యాక్టీరియా ఫంగస్ పెరిగే అవకాశం ఉంటుంది. ఇది చర్మ సంబంధిత సమస్యలు, అలర్జీలకు కారణం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని వాస్తు నిపుణులు బట్టలు ఉతకడానికి సోమవారం, బుధవారం, శుక్రవారం వంటి రోజులను అనుకూలంగా సూచిస్తున్నారు. వీలైనంత వరకు పగటి వేళల్లో సూర్యకాంతి ఉన్న సమయంలో బట్టలు ఉతికి, ఆరబెట్టడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని ఆరోగ్యం, ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
NOTE: పై వార్త సమాచారాన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే తెలియజేశాము. దీనిని స్టార్ త్రినేత్రం ధృవీకరించట్లేదు.
ALSO READ: Recipes: బీరకాయ కర్రీలో కొంచెం కొత్తదనం కావాలా?.. అయితే కొంచెం పెరుగు కలపండి అదిరిపోద్ది!