Epstein Files: అమ్మాయిలతో శృంగారం చేయడం వల్ల వ్యాధి బారిన పడ్డ బిల్ గేట్స్?
Epstein Files: అమెరికాలో ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్ స్టీన్‌కు సంబంధించిన సెక్స్ కుంభకోణం మరోసారి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ కేసుకు సంబంధించి సుమారు 30 లక్షల పేజీల దర్యాప్తు పత్రాలను అమెరికా న్యాయశాఖ తాజాగా బహిర్గతం చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విడుదలైన ఎప్ స్టీన్ ఫైల్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వంటి ప్రపంచ ప్రఖ్యాత వ్యక్తుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. అయితే ఫైల్స్‌లో పేర్లు ఉన్నాయన్న కారణంతోనే వారు తప్పు చేశారని అర్థం కాదని న్యాయశాఖ స్పష్టం చేసింది.
ఈ దర్యాప్తు పత్రాల్లో ముఖ్యంగా బిల్ గేట్స్ కు సంబంధించిన ఆరోపణలు తీవ్ర ఆసక్తిని రేపుతున్నాయి. రష్యన్ యువతులతో గడిపిన అనంతరం బిల్ గేట్స్ కు లైంగిక వ్యాధి సోకిందని ఎప్ స్టీన్ తన ఈమెయిల్ లో పేర్కొన్నట్టు ఫైల్స్ లో వెల్లడైంది. గేట్స్ రష్యన్ యువతులతో శారీరక సంబంధాలు పెట్టుకున్నారని ఆ కారణంగా వ్యాధి సోకిందని ఎప్ స్టీన్ ఆరోపించాడు. ఈ విషయం బయటకు రాకుండా ఉండేందుకు గేట్స్ తన భార్య మెలిండాకు యాంటీబయాటిక్స్ ఇవ్వాలని ప్రయత్నించినట్టు కూడా ఎప్ స్టీన్ తన మెయిల్ లో రాసుకున్నాడని ఫైల్స్ లో ఉంది. అంతేకాదు తనతో ఆరేళ్ల పాటు కొనసాగిన స్నేహాన్ని గేట్స్ అకస్మాత్తుగా ముగించాడని కూడా ఎప్ స్టీన్ పేర్కొన్నట్టు వెల్లడైంది. అయితే ఈ ఆరోపణలను బిల్ గేట్స్ పూర్తిగా ఖండించారు. తనతో సంబంధాలు కొనసాగించలేదన్న కారణంతోనే ఎప్ స్టీన్ తనను బ్లాక్ మెయిల్ చేసేందుకు ఇలాంటి అబద్ధపు కథనాలను సృష్టించాడని గేట్స్ స్పష్టం చేశారు.
ఇదే ఫైల్స్ లో ఎలాన్ మస్క్ పేరు కూడా బయటపడింది. అమెరికాలోని వర్జిన్ దీవుల్లో ఉన్న తన ప్రైవేట్ దీవికి రావాలని ఎప్ స్టీన్ మస్క్ కు పలుమార్లు ఈమెయిల్స్ ద్వారా ఆహ్వానం పంపినట్టు వెల్లడైంది. అయితే ఆ ఆహ్వానాలను మస్క్ తిరస్కరించినట్టు దర్యాప్తు పత్రాల్లో స్పష్టంగా ఉంది.
బ్రిటన్ యువరాజు ప్రిన్స్ ఆండ్రూ కు సంబంధించిన వివరాలు కూడా తాజా ఫైల్స్ లో వెలుగుచూశాయి. 2010లో ఎప్ స్టీన్ ను బకింగ్ హామ్ ప్యాలెస్ కు విందుకు ఆహ్వానించినట్టు ఆండ్రూ పంపిన ఈమెయిల్స్ బయటపడ్డాయి. ప్రైవేట్ సమయం గడపాలంటూ ఆహ్వానించినట్టు రికార్డులు చెబుతున్నాయి. అయితే ఆ ఆహ్వానాన్ని ఎప్ స్టీన్ స్వీకరించాడా లేదా అన్నది స్పష్టత రాలేదు. ఇప్పటికే సెక్స్ కుంభకోణం ఆరోపణల నేపథ్యంలో ప్రిన్స్ ఆండ్రూ ను అన్ని రాజ కుటుంబ హోదాలు గౌరవాల నుంచి బ్రిటన్ రాజు చార్లెస్-3 తొలగించిన విషయం తెలిసిందే.
ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన నేపథ్యం చూస్తే తన పరపతి పెంచుకోవాలనే ఉద్దేశంతో అతడు ఏళ్ల తరబడి టీనేజ్ బాలికలను యువతులను లక్ష్యంగా చేసుకున్నాడని ఆరోపణలు ఉన్నాయి. 2002 నుంచి 2005 మధ్యకాలంలో మైనర్ బాలికలను డబ్బు ఆశ చూపించి న్యూయార్క్ లోని మాన్ హాటన్ భవనం, ఫ్లోరిడా, పామ్ బీచ్ ఎస్టేట్, వర్జిన్ ఐలాండ్స్, మెక్సికో వంటి ప్రాంతాల్లోని తన నివాసాలకు తీసుకెళ్లి లైంగిక దుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపణలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అమెరికాలో అతడిపై చైల్డ్ సెక్స్ ట్రాఫికింగ్ కేసు నమోదైంది. 2019 జూలైలో జైలుకు పంపిన ఎప్ స్టీన్ అదే ఏడాది ఆగస్టు 10న మాన్ హాటన్ జైలు గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
ఎప్ స్టీన్ సన్నిహితుల జాబితాలో డొనాల్డ్ ట్రంప్ తో పాటు మాజీ అధ్యక్షులు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు ఉన్నారనే వార్తలు గతంలోనే వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పూర్తిగా బహిర్గతం చేయాలని అమెరికా న్యాయశాఖ ఆదేశాలు ఇవ్వడంతో తాజా ఫైల్స్ విడుదలయ్యాయి. రాజకీయ నేతలు, జర్నలిస్టులు, వ్యాపారవేత్తలు టెక్ టైకూన్స్ సినీ ప్రముఖుల పేర్లు ఈ జాబితాలో ఉండటంతో ఈ వివాదం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ALSO READ: Shocking: ఇద్దరిని పెళ్లి చేసుకుని.. మూడో వ్యక్తితో మహిళ పరార్!