🏠 startrinethram.com
Watermark
Clip Header Logo
Date of Publish : 31 January 2026, 1:08 pm Posted by : STAR TRINETHRAM

Shocking: ఇద్దరిని పెళ్లి చేసుకుని.. మూడో వ్యక్తితో మహిళ పరార్!

News Image
Shocking: కర్ణాటకలో చోటుచేసుకున్న ఓ షాకింగ్ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఒకే మహిళ ఇద్దరు వ్యక్తులను పెళ్లి చేసుకుని, చివరికి మూడో వ్యక్తితో పరారైన ఘటన దొడ్డబళ్లాపుర పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఒకేసారి ఇద్దరు వ్యక్తులు తమ భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు కథ బయటపడింది. పోలీసులకే ఆశ్చర్యం కలిగించిన ఈ ఘటనలో విచారణ సాగేకొద్దీ సంచలన నిజాలు వెలుగుచూశాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుధారాణి అనే మహిళ మొదట వీరేగౌడ అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొదట కుటుంబ జీవితం సాఫీగానే సాగినప్పటికీ, భర్తకు కార్ లేదా బైక్ నడపడం రాదని, ఎన్నిసార్లు చెప్పినా నేర్చుకోవడం లేదన్న అసంతృప్తితో సుధారాణి భర్తకు దూరంగా ఉండడం ప్రారంభించింది. ఇదే సమయంలో ఆమె జీవితం మరో మలుపు తిరిగింది.

ఈ క్రమంలో సుధారాణికి అనంతమూర్తి అనే డెలివరీ బాయ్‌తో పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా సన్నిహితంగా మారి, ఆ తరువాత ప్రేమాయణంగా మారింది. భర్త వీరేగౌడకు ఏమాత్రం తెలియకుండా సుధారాణి అనంతమూర్తితో కలిసి తిరుగుతూ అతడిపై పూర్తిగా ఆధారపడింది. చివరకు భర్తకు తెలియకుండా ఓ ఆలయంలో అనంతమూర్తిని పెళ్లి కూడా చేసుకుంది. రెండో పెళ్లి తర్వాత కొంతకాలం అతడితో కలిసి ఉన్న సుధారాణి, అతడి వద్ద నుంచి దాదాపు రూ.20 లక్షల వరకు తీసుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది.

పెళ్లి జరిగి సుమారు ఏడాది గడిచిన తరువాత సుధారాణి ఒక్కసారిగా ఇంటి నుంచి కనిపించకుండా పోయింది. దీంతో అనంతమూర్తి తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. అయితే అతడు వెళ్లిన అదే పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే వీరేగౌడ తన భార్య సుధారాణి కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇద్దరు వ్యక్తులు ఒకే మహిళ గురించి ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు.

కేసును లోతుగా విచారించిన పోలీసులు ఇద్దరి భార్య ఒక్కరేనని నిర్ధారించారు. అంతేకాకుండా సుధారాణి ఇద్దరినీ మోసం చేసి, కనకపురానికి చెందిన మరో వ్యక్తితో పరార్ అయినట్టు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. ఒకే మహిళ ఇద్దరు వ్యక్తులను పెళ్లి చేసుకుని, ఆస్తి కోసం మోసం చేసి మూడో వ్యక్తితో పరారవడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ALSO READ: దారుణం.. ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగలబెట్టింది (VIDEO)
🏠 Home